గరిక పూలు - వురిమళ్ల సునంద, ఖమ్మం
వురిమళ్ల సునంద, ఖమ్మం
అంశం::గరిక పూలు
శీర్షిక:: మేం గరిక పూలమే
సంఖ్య::286
:::::::::::::::::::::::::::::::::::::::::
మేం గరిక పూలమే.. అయితేనేం
తొలకరి చినుకు పలకరించగనే
పులకించిన పుడమి తల్లి
హరిత వర్ణ చెక్కిళ్ళపై మెరిసే వలపుల నును సిగ్గులం..
ఆకుపచ్చని అవనమ్మ గుండెలనిండా
విచ్చుకున్న నవ్వులం..
మిలమిలల తళుకులీనుతూ నింగి నుండి దిగివచ్చిన తారకలం...
పూజకు నోచని పువ్వులమైనా
దేశం కోసం శ్రమించే
సైరికుడు సైనికుడు మరెవరైనా
కష్టించే పాదాలను కందకుండా హత్తుకుని
ప్రణమిల్లే వినమ్రులం..
బాల భానుని లేలేత కిరణాల స్పర్శకే ఆనందించే
అల్ప సంతోషులం.హ
కనులున్న హృదయాలకు కనువిందు చేసే గరిక పూల వనాలు...
కబళించాలని చూసే కష్టాల వరదలకు
దోచుకుపోవాలని చూసే బాధల తుఫానులకు
ఎదురీదే చెక్కుచెదరని ఆత్మ విశ్వాస ప్రతీకలం...
హేమంత తుషార కన్నియలకు పానుపులమై మురిసే పువ్వులం
ప్రకృతి ఒడిలో మేం సైతం పల్లవించే
చైతన్య స్రవంతులం...

Comments
Post a Comment