Posts

Showing posts from August, 2019

కోకిలమ్మ - శ్రీదాస్యం లక్ష్మయ్య

శ్రీదాస్యం లక్ష్మయ్య💐 కవిత సంఖ్య: 241 అంశం: కోకిలమ్మ  -  శ్రీదాస్యం లక్ష్మయ్య శీర్షిక: కూజితారావాల కొమ్మా *********** కిలకిలారావాల కోకిలమ్మ నీ పాట వసంతుని రాకను వచియించు నీనోట మేనిఛాయనలుపైనా నీగొంతున మెరుపు ప్రకృతి కాంత పరవశించు పసందైన నీపిలుపుకు కొంగొత్త చివురుల గాంచిన మది పులకింత కుహుకుహూ గానాలను పలికించదె నీనోట ఆమనిరాకను ముందే పసిగట్టే జ్ఞానధనం వరముగ పొందిన నీ బ్రతుకే ధన్యము చిరుకొమ్మన తులతూగుతు నినదించే నీస్వరం చిగురాశల వసంతాల మేలుకొలుపు నీగానం పలుకులోని మాధుర్యం చిలికించే సౌశీల్యం పరవశాన శిరసులూగి  నవపల్లవాల పల్లవించు కవుల కలాల కలవరింత నీవు  గానగంధర్వుల గానలహరి.. నీవు తేనెలూరుచుండు తేటపలుకునీవు కోకిలమ్మా... కూజితారావాల కొమ్మా

కోకిలమ్మ - వురిమళ్ల సునంద

వురిమళ్ల సునంద, ఖమ్మం అంశం:: కోకిలమ్మ - వురిమళ్ల సునంద శీర్షిక:: నీ జాడ ఎక్కడ..? కవిత సంఖ్య::288 ******** మంచు తాగిన గళాన్ని మౌనంగా సవరించుకుని కుహూ కుహూ రాగాలతో వసంతుని సాదరంగా ఆహ్వానించే వాసంతమా! గున్న మావి గుబురుల్లో దాగి లేలేత చివుళ్ళను మేసి మత్తు మత్తుగా  కొమ్మల ఊగుతూ ఓయ్ అంటే ఓయ్ అంటూ చిలిపిగా కూసే పంచమాస్యమా! ఆమనికి ఆనందంగా ఆహ్వానం పలికే పికమా!! ఎక్కడమ్మా నీ జాడ..? హరిత వర్ణపు చీర కట్టుకుని కలకూజితాలతో కిలకిలల రవాలతో మురిసి పోయిన వన దేవత ఒడిలో ఓలాలడాల్సిన వన ప్రియమా! ఎక్కడమ్మా ..నీ జాడ? అడవులన్నీ కాంక్రీటు వనాలై విస్తరిస్తుంటే మధుమాసంలో తలదాచుకునేందుకు చోటు లేక తప్పిపోయావా అనిమకమా! ఆకుపచ్చని వీణపై హరివిల్లు వర్ణాల గమకాలతో హొయలు పోవాల్సిన నీవు అడుగడుగునా విస్తరిస్తున్న ఎడారులలో బతకలేనని వలస పోయావా బతుకునే బలి చేసుకున్నావా... మానవ తప్పిదాలు క్షమించు శ్యామమా!  మేమంతా నందనవనాలతో స్వాగతం పలుకుతాం రావమ్మా రా !కుహూ రాగాల కోయిలమ్మా! మా ఎదనిండా నీ తీయని గానామృతాన్ని నింపిపో..

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

అంశం: కోకిలమ్మ  -  మద్దెల ప్రభాకర్ శీర్షిక : గాన కోకిల ******** కొమ్మల చాటున దాగిన కోకిల కుహు కుహు అని పాడేవు నలుపంటు నవ్విన నీ ఒంటికే కానీ మధురమైన  గొంతుతో మైమరపించేవు వసంత కాలం రాగానే వలపుల పిలుపులు పిలిచేవు లేతమామిడి చిగుళ్ళు తింటూ చిలిపి చేష్టలు చేసేవు అనువుగాని చోట మూగనోము నోచి అదును చూసి రాగమాలపించేవు చేనుచెలకల్లోన చెమటోడ్చే రైతన్న నీపాట కొరకు  పరితపిస్తున్నారు. మా మనసు రంజింప మౌనము విడనాడి అలసట తీర్చగా ఆలపించగ రమ్ము ఎవరు నేర్పారమ్మ నీకీ గాత్రము ఆమనిని చూడగానే పరవశమొందేవు చిత్రమూ సాధనా లేకనే సరిగమలు పలికేవు తాళమేయకున్న లయ నీవు తప్పవు. గాన గంధర్వులు నీకు సాటిరారు గాన కోకిలంటూ   బిరుదును ఇచ్చేరు . ధన్యమేనమ్మా నీ పక్షి జన్మ మనుజమాత్రులయిన నీ సాటి రారమ్మ.

కోకిలమ్మ - యమ్ వెంకటలక్ష్మి

కవిత సంఖ్య : 128 అంశం : కోకిలమ్మ  -  యమ్ వెంకటలక్ష్మి శీర్షిక : కవికోకిలలు ప్రకృతికోయిల మధురస్వరం వసంత ఋతువు తదనంతరం మటుమాయమై అడపాతడపా అక్కడక్కడ ఆషామాషీ స్వరాన వినబడుతుంది ; 'నేటి కవిత' తోటలోని కోయిలలు ఏడాదిపొడవునా కాలచక్రపు కదలికకు స్పందిస్తూ ప్రతిస్పందిస్తూ, భూతభవిష్యద్వర్తమానాలలో విశ్వమంతా పరిభ్రమిస్తూ, కవిత్వాన్ని స్మరిస్తూమేల్కొని, కవితాలాపన చేస్తూనే వృత్తి ధర్మాలను నిర్వర్తిస్తూ, కవిత్వాన్నే మాట్లాడుతూ, కవిత్వాన్నే భోంచేస్తూ, కవితలనే కలవరిస్తూ పలవరిస్తూ ప్రతిక్షణాన్నీ కవితామయం చేస్తున్న ఈ కాలం కవికాలం- అవును ఇది మన నేటి కవికోకిలల కాలం!

కోకిలమ్మ - దారల విజయ కుమారి

కోకిలమ్మ  -  దారల విజయ కుమారి శీర్శిక :మనసు మౌనాలను తట్టిలేపే ******* రమ్యమైన రాగాలను రువ్వుతూ కొమ్మలమాటున కనపడకుండా..వినపడే కోయిల అనాదిగా..ఆమని నిండుగా ఆహ్లాదాన్ని నింపుతూ గురువు నేర్పని గమకాలతో వలపు తలపులను మనసు మౌనాలను తట్టిలేపే కోయిల సరాగాలు ఎడారి ఎదలలోనూ పచ్చదనాల ఒయాసిస్సులను మొలిపించే కోయిల ఎదలను మెలిపడుతూ.. జ్ఞాపకాలను కలియదిప్పుతూ పిలవకనే హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోయే తన ఆర్ద్రతా గీతాలు జీవన కాలంలో...తప్పని శిశిరాలలో.. గాయపడ్డ హృదయాల తడినెరిగి ఆర్తి గీతాలను ఆలపించే ఆ నల్లని అందాల గొంతులు ఆ కుహూ కుహూల కూ.. కలతలున్నాయ్ చేజార్చుకున్న ఆనవాళ్ళున్నాయ్ అమ్మతనపు ఆవేదనలున్నాయ్ చైత్రపు గుండెలకోసం స్వాంతన గీతాలనిచ్చి చల్లగా మెల్లగా తరళిపోయే ఆమని వైభవాలు..ఈ కోకిలమ్మలు

కోకిలమ్మ - సుభాషిణి వెగ్గలం

కవిత సంఖ్య :77 అంశం :కోకిలమ్మ  -  సుభాషిణి వెగ్గలం శీర్షిక :ప్రకృతికి-కానుక రాలుతున్న పండుటాకులు ఆమనికి స్వాగతం పలుకుతూ లేలేత చిగుళ్లతో వసంత గీతమాలపిస్తున్నాయి మండుటెండల్లో ఆహ్వానించి ఇచ్చిన మావి చిగుళ్ల విందుకి మైమరచిన కోకిలమ్మ వీనుల విందైన అమృత గానాన్ని కానుకిస్తుంది ప్రాణం పోసిన ఆ బ్రహ్మే కోకిలమ్మ గాన మాధుర్యానికి పరవశించి మైమరచి పోయాడేమో తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగు పులిమాడు రంగేదైనా వీనుల విందైన గాత్రాన్ని ప్రకృతికి కానుకగా ఇచ్చాడు

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

అంశం: కోకిలమ్మ  -  కాసనగొట్టు స్వప్న. శీర్షిక: గాలిస్తున్నా... కవిత సంఖ్య: 226 ***********  రంగుతో ఒరిగేదేముందంటూ రాగాలతో రోగాలు పొగొట్టిన నేస్తానికై గాలిస్తున్నా... ప్రభాతమునే పచ్చనికొమ్మల దాగి కుహూ కుహూ అంటూ గొంతెత్తి దాగుడుమూతలాడే కోకిలమ్మకై గాలిస్తున్నా... తన గాత్రమాధుర్యంతో తనువు పులకరింపజేసి పరవశాల ఊయలూపే పక్షిచెలియకై గాలిస్తున్నా... మాయమైన తరువుల ఎడారిలో మానవతలు మరీచికై మొలచిన సెల్ టవర్లతో మూగబోయిన మిత్రురాలి రాగాలజోలకై మిడుకుతూ మిణుగురుపురుగునై గాడాంధకారంలో గాలిస్తున్నా...

కోయిలమ్మ - కటుకం కవిత

తేది:21/6/2019 అంశం: కోయిలమ్మ  -  కటుకం కవిత కవిత సంఖ్య:236 కవిత శీర్షిక: కోయిలమ్మ గానం పూలకు పరిమళం అందం సెలయేటికి గలగల అందం నెమలి నాట్యం అందం నింగికి చుక్కలు అందం నేలమ్మకు తరువులు అందం ప్రకృతికి కోయిలమ్మ గానం అందం...!! వసంతాగమనానికి సుస్వరాల సంగీతకచేరీతో స్వాగతగీతికలు ఆలపించగా ప్రకృతిమాత పులకరించి పరవశించును చైత్రమాసానికి ఆహ్వానం పలుకును...!! మేను నలుపైనా గానం అమృతం... గున్నమామిడి తరువుపై పచ్చదనాల కొమ్మలమాటున లేలేతచివుళ్ళు తింటూ... కుహుకుహూ అనే మధురస్వరంతో యావత్తు జగత్తును తన్మయత్వం నొందెలా చేసే కోయిలమ్మ గానానికి సరితూగేది మరొకటి లేదు ఇలలోన...!!

.కోయిలమ్మ - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

హైదరాబాద్ కవితసంఖ్య...250 అంశం..కోయిలమ్మ  -  డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి శీర్షిక...ఆ పాట మధురం -------------------------------- శిశిర ఋతువులో ఆకులురాలి వసంత ఋతు ఆగమనంతో నూతనత్వాని సంతరించుకుని చిగురులు వేసే తరువులు!! లేత మావి చిగుళ్లు తిని మత్తెక్కిన గండుకోయిల ఆలపించే మధురగానం ఆమనికి  స్వాగతగీతం!! కూ అంటే కుహుకుహు అని మనతో జత కలిపి గొంతు సవరించుకుని పాడే కోయిలమ్మ అందరి మనసును దోచిన గాన గాంధర్వపక్షి!! కనిపించకుండా కొమ్మలో దాక్కుని దాని కమనీయ నీల వర్ణ మేని సొగసుకు ఆకర్షణీయమైన కంఠం దానికున్న ఆభరణం అదే మనకు వరం!! కాకి కోకిల రూపొకటైనా కొమ్మ కొమ్మకు కమ్మని గాన సొబగులు అద్దుతూ గాన మాధుర్యంతో మైమరపించే కోకిలమ్మా నీకు నీవే సాటి పక్షుల్లో మేటి...!!

కోయిలమ్మ - పులి జమున

అంశం:కోయిలమ్మ  -  పులి జమున శీర్షిక:స్వాగత గీతం కవితాసంఖ్య:129 గున్నమావి తోటలో కొమ్మల మాటున కోయిలమ్మ లేతమావి చిగుళ్లు తిని మత్తిల్లిన ఎలకోయిల కుహూకుహూ రాగాలతో వీనుల విందు చేసే మధుర సుస్వరాలతో నవ వసంతాగమనానికి స్వాగత గీతమాలపిస్తోంది మల్లెల సౌరభాలను తుమ్మెద ఝంకారాలను మయూర నృత్యాలను ప్రకృతి పరవశాలను తన జతగా చేసుకుని బాల భానుని నులివెచ్చని కిరణాలకు పుడమి పులకించగా వెన్నెల వెలుగులను వెంటబెట్టుకుని నూతనోత్సాహం తో నూతన వత్సరానికి ఆహ్వానం పలుకుతూ చైతన్య రాగమాలపిస్తోంది నేడు హరితవనాలు అంతరించి కోకిలమ్మ ఆవాసం కరువై ముందుతరాలకు తన ఉనికి కనుమరుగై పోతుంటే మోడుబారిన మ్రానులను చూస్తూ ఆవేదనను చెందుతూ మూగబోయిన రాగమౌతోంది

కోకిలమ్మ - నగునూరి రాజన్న

అంశం -కోకిలమ్మ  -  నగునూరి రాజన్న  తేదీ - 21-06-2019 శీర్షిక - సృష్టి సమ భావన సంఖ్య -217 శిశిరంలో ఆకురాల్చి వసంతంలో చిగురించగానే పిలవని పేరంటమై పండగలా వస్తావు ఆమని అతిథిగా చివురాకుల నేస్తమై కూనిరాగాలు తీస్తావు ఎద ఎదలో మధురానుభూతులు నింపేస్తావు  రూపు నల్లనైనా నీ రాగమెంతో చల్లన పిల్లలంతా నిన్ను అనుకరించి ఆటపట్టించినా కొమ్మ కొమ్మన దాగుడుమూతలాడి అలరిస్తావు పిల్లలు కేరింతలతో ఆనందిస్తే మురిసిపోతావు అంత మధురమైన కంఠమిచ్చిన దేవదేవుడు ఆ కాకి రూపం ఎందుకో ... నలుపు రంగు ఏలనో....... ప్రపంచమేలే పంచ కళ్యాణి పలుకులు నువ్వు పంచితే బహుశ పిల్లల పొదిగి పెంచే పని కాకమ్మకు ఒప్పగించ కాబోలు... ఆశతో ఎదురుచూసే మాకు ఋతుపరంగానే  వస్తావు పండగ అందాలు సందడి ఆనందాలు ఇనుమడిస్తావు సృష్టిలో సర్వస్వం  సమ భావన సంకేతమల్లె నీ రాగాలాపన మిగతా కాలం అభ్యసించమనా.... ఏదైతే ఏం లే... నీ పేరు మీద బిరుదులే ఇస్తారు మనుషులకిక్కడ...

కోయిలమ్మ - మమత ఐల

కవిత సంఖ్య:—71 అంశం:—కోయిలమ్మ  -  మమత ఐల శీర్షిక:—పాటలరాణి —————————————— మథుర గాయిని పాటల రాణి కోయిల వాణి వన్నె నలుపైనా కాకి రూపైనా గలం తేనే అమృత గానం ఎవరికున్నా పోలిక పోలుస్తారు నిన్నే వసంతం వెల్లివిరిసిన వేల చల్లగాలిలో పిల్లవాయుల మద్య కోయిలరాగం పంచామృతంవలె నీ కువకువలు జనులనాకర్షింపగా ఆ..సమయాన్ని సంగీత మథువనిలో తేలిపోతున్నట్లు జనసమూహమంతా నీ మథురగానానికి ముగ్దులై పరవసించి నీతోపాటు కుహు - అంటే - కుహు అని నీ గొతుంలో గొంతు కలిపి పాడిస్తావు సంగీత స్వరబానివి నువ్వే పాటల మహరాణివి నువ్వే

కోకిలమ్మ - కె.ఎల్.సరోజా రెడ్డి

అంశం  : కోకిలమ్మ - కె.ఎల్.సరోజా రెడ్డి శీర్షిక     : సంగీత ఝరి సంఖ్య  : 261 తేదీ      : 21/6/19 ********* చల్లని సాయంత్రం వేళ.... పడమటి సంధ్యారాగం అపురూప భావాలను అలవోకగా విసురుతున్నది.... గున్న మామిడి కొమ్మల గుబురులో ఆకుపచ్చని ఆశల్ని గొంతునిండా నింపుకుని చిలిపి చిన్నారి కోయిలమ్మ పూల ఋతువుకు కన్నుగీటుతూ పరవశాల పాటలపల్లకిలో ఊరేగుతున్నది.... నా మానస సరోవరంలో మధుర భావాల రాయంచలు ముగ్ధమోహన రూపంతో ఆనంద జలకాలాడుతున్నాయి..... సుస్వరాల సంగీత ఝరులు పులకింతల పరిమళాలతో పుడమిని పునీతం చేస్తున్నాయి...... అంతా అనురాగమయం నవ జీవన వికాసానికి శ్రీకారం **********

కోకిల - నల్లు. రమేష్

కవితా సంఖ్య:-144 అంశం:-వసంత కోకిల  -  నల్లు. రమేష్ శీర్షిక:-"తిరిగి రాని వసంతం" "మబ్బులు లేని మిద్దె పైన  ఓ జాబిల్లి ఉండేది  కొన్ని నవ్వులు నాకై  క్రిందకు ఒలికేది  బిందెలు బిందెలుగా  భుజాలపై  భారం తెలియక మోసే వాణ్ణి  ఉన్న పళంగా  అక్కడో వనం వెలిసేది  కోయిల రాగాలకు  పందిర్లు వేసేది  నా చుట్టూ వసంతం మొలిచేది  బదులు కోసం  రోజు రోజుకూ రాగాలు  పొడిగించేది  నన్ను చేరిన వసంతం  శాశ్వతమన్న భ్రమలో నేను  మైమరచి పోతున్నా..  అంతలోనే మంచుతెరలా  వసంతం కరిగిపోయింది  మూగబోయిన రాగాలు  చిగురిస్తాయని  నేటికీ వసంతాలను  జల్లెడ పడుతున్నా  తిరిగి రాదని తెలిసి  కవిగా మిగిలి పోతున్నా!

కోకిలమ్మ - చిందం సునీత

తేది: 21/6/2019 అంశం: కోకిలమ్మ  -  చిందం సునీత కవిత సంఖ్య: 176 కవిత శీర్షిక :కోకిల రాగాలు పచ్చని చెట్ల మాటున కోకిలమ్మ మధురంగా తీయని స్వరంతో రాగాలతో రాగంతీస్తూ0టే  చైత్రమాసం మావి చిగురుతో కొత్త ఉత్సహపు ఆనందాన్ని మనిషి గొంతుకలో తనకు వంతపాడుతూ సరిగమలెన్నో నేర్చుకొని ఆమని కోయిలల రాగాలాలపిస్తూ ఆనందరాగాలు అందించే కోకిలమ్మ రాగమంటే నా కెంతో ఇష్టం!!.

కోకిలమ్మ - గీతాశ్రీ మెదక్

నేటికవిత@137 అంశం:కోకిలమ్మ  -  గీతాశ్రీ మెదక్ శీర్షిక:కోయిలగొంతు మూగబోయింది ~~~~~~ చైత్ర మాస వేదికకు శుభారంభము పలుకుతూ వసంత ఆగమనానికి సుస్వరాలను ఆలపించు కోయిలమ్మ నలుపు రంగున్ననేమి సమస్తాన్ని తనగాత్రంతో అలరించు  తీయని స్వనాలమేనా ఆ మధురబాణీలకు ఉప్పొంగని మనసుందా ఆ కుహు కుహూల కూజితాన్ని కోరని కర్ణముంటుందా... అద్దె ఇంటిలో పెరిగినంత మాత్రాన రంగులసామ్యతనే అదననుకోలేదు ఎప్పుడు దేవుడు గీసినరాతని సర్దిచెప్పుకుంది సరికొత్త పల్లవులందుకుని విరహశిశిరాలను రాల్చుకున్న వనాలకు చెలిమిగీతమవుతుంది పచ్చపచ్చని కొమ్మలచాటున మత్తుగా మావిచిగురులు తింటూ రాగాలుతీసే కోయిలగొంతు నేడు మూగబోయింది ఎందుకో.. పచ్చికలేని నేల విలపిస్తున్నందుకో మానవత్వపుతడి ఇగిరిపోయి మనిషి మరణిస్తున్నందుకో మరి

కోయిలమ్మ - సోంపాక సీత

కవిత సంఖ్య: 185 అంశం : కోయిలమ్మ  -  సోంపాక సీత శీర్షిక: కోయిలే ఆదర్శం ******** నడిచే రైలుకు నల్లనిబొగ్గే ప్రాణశక్తై నిలిచెగదా నల్లని మబ్బులె రైతు హృదిలో నవ్వులజల్లులు పంచెగదా.... నల్లని అగరే నవ్వేపాపకు దృష్టి చుక్కగ అమరెగదా రాతిని నాతిగ మార్చిన ఆ వైకుంఠ రాముడు నలుపుగదా.... నల్లని రాళ్లే నలుగురూ మెచ్చే శిల్పాలై మురిసెగదా నారాయణుడే మెచ్చుననే శాస్త్రము నలుపుకు వుంది గదా.... నల్లనికురులే చక్కగవుంటే నయనానందం ఒలికించుగదా కోయిల వర్ణం నలుపే అయినా గానమెంతో సొగసుగదా.... పక్షి జాతిగా పుట్టినగానీ విజ్ఞాన మెంతోమెండుగదా కోయిల దారిన నడిచే నరులు ఇలకే ఆదర్శమౌనుగదా ....

సురక్షా గీతం - ఏడెల్లి రాములు

ఏడెల్లి రాములు * సురక్షా గీతం  -  ఏడెల్లి రాములు   చిన్ని చిన్ని మువ్వల ఆశ చిత్రమే ఇది చిన్ని పువ్వు శ్వాస శరమే కదా శరీరం విల్లు వంచితేనే శరపరంపర శస్త్రం ఇల్లైనా విల్లైనా కళాత్మకం యోగమైనా ఆసనమైనా శరీర ధర్మ సంరక్షణం పాంచభౌతిక ఇహం పంచభౌతిక శరీరం తాదాత్మ్యమే తన ధ్యానం పంచేంద్రియాలకు పగ్గం ధారణ యమ నియమం తా ఋషియై మహర్షి గా తపోవన ఉషస్సే యశస్సు మనసు కట్టడి మంత్రం ధ్యానం మనిషి ఆరోగ్య సూత్రం యోగాసనం నిత్య ఆదిత్యారాధనయే మనోమయ సుమగీతం సూర్య నమస్కారాలే ఆరోగ్య సంరక్షణ లో శ్రీ రామ రక్ష ఓ శ్లోకం చదువూ శోకం దూరం చేయు ఓ శాంతి మంత్రం ఇలకు సౌశీల్య సారథ్యం నా తల్లి భారతీ ఒడి సంగీత సాహిత్య దర్శనం యోగా ముద్రా సమ్మేళనం మనిషిని మనీషిగా మార్చే శిల్ప రూప నవీనత ప్రపంచానికి పరిచయ ప్రధాత శాంతికీ క్రాంతికీ ప్రగతి విధాత అనుసరించడమే మానవ ధర్మం మనో వికారాలను త్రుంచడమే నేటి కర్తవ్యం

కోకిలమ్మ - :వై.కె.సంధ్యశర్మ

ఊరు: చిత్తూరు సంఖ్య:.85 అంశం : కోకిలమ్మ -  :వై.కె.సంధ్యశర్మ శీర్షిక :  ఓ కోయిలమ్మ! వసంత నీరీక్షణలో మొండి మొలలతో నిలబడ్డ వృక్షాలను అడిగింది ఓ కోయిలమ్మ కానరాని పచ్చదనానికి కారణమేమని చివుళ్ళేయని చిటారుకొమ్మల నడుమ ఆకులేవని పండు వెన్నెల్లా కాసే ఫలాలేవని! పక్షుల కువకువల కూని రాగాలు రామచిలుకల పలుకులు కాకమ్మ కబుర్లేవని! బుర్రుపిట్టలు తుర్రుమనే చెట్టు తొర్రలేవని గువ్వల గుంపుల గూళ్ళేవని! వయ్యారి ఉడుతల అల్లరేదని వడ్రంగి పిట్టల వలపు పిలుపులేవని వానరతోకల కథలేవని! గరుత్మంతుని కాలి జాడలేవని! పావురాళ్ళ పొదరిళ్ళేవని! కాటుక కళ్ళ కోయిలమ్మ కన్నీరొలికింది! గతి తప్పిన పచ్చదనమంతా కాలుష్యపు కార్చిచ్చులో కనుమరుగయిందని చెప్పకనే వాపోయింది వృక్షరాజము...జాలి చూపులతో...

కోకిలమ్మ - మిట్టపల్లి పరశురాములు

అంశం;కోకిలమ్మ  -  మిట్టపల్లి పరశురాములు కవితసంఖ్య:259 శీర్షిక:తీయనిగానం దివి:21-06-2019         *** చల్లగా మెల్లెగామెలికల! ఒయ్యారాలపులకరింతల!! అందాలు ఆరబోసుకొని! ఆమనిఅరుదెంచినవేళ!! కొమ్మరెమ్మల్లో కోటిస్వరాల! గానామృతఝరిలో... కోకిలమ్మ కుహుకహూన! కూతకూసి రంజింపజేసింది! పచ్చని పంటలకు ! వెచ్చనిజంటలకు !! అదేపనిగాహాయినిచ్చి!! నూతనోత్సాహామై... ప్రకృతిమాతను  ! పరవసింజేసింది !!  నల్లనిరూపున ! చల్లనిమనసున !! యెల్లరియెదలను కదిలించే నాదమైసునాదమై ... చక్కనిచూపుల ! చిక్కనితలుపుల !! మోదముకలిగించే ! ఆత్మీయనెచ్చలి !! పాటలమాటల ఆటలతో! ఝమ్మని కమ్మని స్వరములతో.... రా రమ్మని పిలిచెను రయముగను.... అందాలొలికే కోకిలగానము! బుడిబుడినడకల!! హంసలకన్నా... పంచవన్నెలా చిలకలకన్నా! సుందరమయూరాలకన్నా!!  జుంటిధారలకన్నా ! కలకండతీపికన్నా  !! మధురాతిమధురమమ్మా! కోకిలానీకమ్మనిరాగమే !!! మాయెదలనుఆనంద డోలికల్లోఓలలాడించి...  మైమరిపింపజేయునమ్మా!!

కోకిలమ్మ - అనూశ్రీ

కవిత సంఖ్య~~188 అంశం~~కోకిలమ్మ  -  అనూశ్రీ శీర్షిక~~కోకిలమ్మ ~~~~~ కొమ్మకొమ్మకూ నేర్పింది కమ్మనైన రాగం... మది మదిలోనూ కురిపించి మధురమైన గానం... వసంతానికి స్వాగతమంటూ పూలవనాల కచేరీచేస్తూ మరింత ఆహ్లాదాన్ని పంచుతూ...  కుహూకుహూ స్వరాలలో సరిగమలన్నీ వినిపించేలా ఆలాపిస్తుంది ఏన్నేళ్ళయినా పాతదవని నవగీతమై.... ఎంతవిన్నా తనివి తీరని గానామృతాన్ని పచ్చని కొమ్మ పల్లకిలో ఊరేగుతూ పంచుతోంది మనసులు మురిసేలా.... మావిచివురుల గుబురుల్లో మసకచీకటి రంగులో మాధుర్యానికి మారుపేరై ఆమనికి తీయని వరమైంది కోకిలమ్మ...!

కోయిల - ఐరేణి కృష్ణవేణి

అంశం:కోయిల -  ఐరేణి కృష్ణవేణి శీర్షిక:వసంత రాణి కవిత సంఖ్య:22 కుహు కుహు రాగాల కోయిలమ్మ! వసంత ఋతువుకు రాణివమ్మా!! విరుల పరిమళాలను ఆస్వాదిస్తూ.. ఝరులలో జలకాలాడుతూ.. లేత చిగుళ్ళను నెమరు వేస్తూ.. పచ్చని హరితాలను ముద్దాడుతూ.. వన విహార రాణివై.. కమ్మని నీ గాన మాధుర్యంతో  ప్రకృతిని పరవశింప చేస్తావు! నీకు తోడు మా బడిలో బుడుతలు కూడా ఉన్నారు! నీకు సరిజోడిగా కూతలు కూస్తూ, నిన్ను అనుకరిస్తూ ఉడికిస్తారు! నీ రాగాల తీగలను వారి గొంతులో సవరించుకొని గాన కోకిలలై గంతులేస్తారు! వనదేవతకు ముద్దు బిడ్డవు! మానవాళిని నీ గొంతులోని తీయ్యటి రాగాలతో మేలుకొలుపే చైతన్య గీతానివీ!!

కోకిలమ్మ - బి.సుధాకర్

సంఖ్య..295(21.6.2019) అంశం..కోకిలమ్మ  -  బి.సుధాకర్ శీర్షిక..గాన మాధురి చల్లని పిల్ల గాలులతో తనువు పులకరించే వేళ తియ్యని రాగమొకటి తనవైపుకు పిలుస్తుంది రంగుదేముందని రాగంతో తెలిపింది మాట మంచిదైతే మనుషులంత ఒక్కటంది కొమ్మల్లో దాగిన కోకిలమ్మ వసంతాల వేడుకలో పసందైన పాటపాడె పరవసించి మయూరి తన్మయించి ఆడింది పాటవిన్న పసిపాప పకా పకా నవ్వింది చెట్టుపైన పక్షులన్ని కోకిలను పొగిడినాయి నల్లగా ఉన్న కోకిల మెల్లగా కూస్తుంది ఎందుకల చాటున ఉన్నా మాటువేసి పట్టినారు బందించి బాధించి బలవంతంగా పాడించినారు ప్రకృతి వదిలేసి పంజరంలో ఉంచినారు కూయలేని కోకిలమ్మ ఎక్కి ఎక్కి ఏడ్చింది కోకిలమ్మ పాటపాడి కోరికలే పెంచింది ఆనందపు ఆశ పెంచి వినోదాలు తెచ్చింది మధురమైన రాగాలతొ కదలకుండ చేసింది శ్రావ్యమైన పాటలతో మనసులాగేసింది

కోయిలమ్మ - విజయలక్ష్మినాగరాజ్

హుజురాబాద్ అంశం: కోయిలమ్మ  -  విజయలక్ష్మినాగరాజ్ శీర్షిక:ఎక్కడున్నావు? లేత చిగుళ్ల ఆనవాళ్లు పుడమికి కొత్తందాలు తెస్తూ... వర్ణాలన్ని వయ్యారాలు పోతున్నాయి! అయినా జాడ లేని కోయిలమ్మ కై కొమ్మ కొమ్మలో అన్వేషించా! చివరకు కనిపెట్టి ... కుశలం అడిగా! ఆమని రాగాలు రమ్యంగా ఆలాపించే ఆ గొంతు నేడు భయంతో మూగబోయింది! వసంతమే తానై... తానే వసంతాన్ని తెచ్చేది నేడు చేష్టలుడిగి చూస్తోంది! మావి చివురుల రుచులతో జతకలిసి కొమ్మల్లో దోబూచులాడుతూ వయ్యారాలు పోయేది ... నేడు ఆ రుచులు సహించటం లేదంటోంది! మల్లెల పరిమళాలను వెంటబెట్టుకుని వెన్నెల వర్షంలో జంట కచేరీలు చేస్తూ సమ్మోహన పరిచేది నేడు భయోత్పాతంతో గూట్లోనే ఉండిపోతానంటోంది! కారణం ఏమిటా అని ... ఆరా తీయాలని ఆరాటపడ్డాను తను లేని వేళ అసంపూర్ణమైన జగతిని చూడలేక! తీపి రాగాల కోయిలైన నాకు ఈ ప్రకృతి శరీరానికి నలుపురంగు పులిమింది.. కానీ అందమైన రూపాన్ని మీకిచ్చింది అని సంతోషపడేలోపే మీ అంతట మీరే హృదయానికి నలుపును అలుముకుని ... మానవత్వాన్ని మరిచారు హెచ్చరిల్లిన హింసాకాండను పారుతున్న రుధిర ప్రవాహాలను దిక్కులు పిక్కటిల్లేలా వినిప...

కోయిలమ్మ - డా॥బండారి సుజాత

అంశం: కోయిలమ్మ  -  డా॥బండారి సుజాత శీర్షిక: రాగాల రాయంచ కవిత సంఖ్య:220 తేది: 21- 06- 2019 కాకమ్మ గూటిలో పురుడు పోసుకొని దాగని వన్నె ,చిన్నెలతో ఎదుగుతూ కాకమ్మ కణికరానికి దూరమయ్యే అనురాగాల ఆమని కోకిలమ్మ వసంతాల వేదికకు వందనాలందించుతూ కుహు ,కుహూ రాగాలతో కుతూహల మందించు కోకిలమ్మ మావిచివుర్ల మలయమారుతంలో మది ఆనందానికి అందలం కోకిలమ్మ ఆకుపచ్చని సోయగాలలో అందాల ఆమనిలో తేనెలొలుకు తీయందనాల రాగాల  రస వల్లరి వినబడిన కోయిల కూతతో చూడాలన్న ఆత్రుతను అణచుకోలేక ,తలఎత్తి చెట్ల గుబుర్లలో వెతికినా కనబడని రాగాలతో దోబూచులాడే మధుర కంఠపు మాల కోకిలమ్మ  ఇద్దరమ్మల ప్రేమకు నోచుకోకున్న నిరాశ నిస్ప్రహలకు లోను కాకుండ తనదైన మార్గం లో ఎదిగే కోకిలమ్మ జీవితం మనందరికి ఆదర్శం

కోకిలమ్మ - వెగ్గలం ఉషఃశ్రీ

అంశం ~ కోకిలమ్మ  -  వెగ్గలం ఉషఃశ్రీ శీర్షిక ~🌷 నిశ్శబ్ద విరహ గీతం🌷 పుడమికి సొగసులద్దగ ఏతెంచిన వయ్యారి వసంతంతో జతై వచ్చిన కోయిలమ్మ... గున్న మామిడి తోటల్లోన లే చిగుళ్ళను కడుపారా భజించి జతకై చేసే కుహూ కుహూ రాగాల కచేరితో దాగుడుమూతలాడుతూ... కుహూ అన్న కొంటె కోణంగికి కుహూ అని గడుసు సమాధానమిస్తూ... వేసవిని ఆహ్లాదభరితం చేస్తూ మనందరి మది దోచి తీయని గానానికి తన పేరునే బహుమతినొసగినది! మరి నేడు... కాలం మారి ఎండలు జ్వలిస్తుంటే... గున్న మావిల్ల తోపులన్నీ ఎండుటాకుల గలగలల సవ్వడి చేస్తుంటే... ఆకలి దప్పులు తీరని గండు కోయిలలిక మౌనవ్రతమునాచరిస్తూ... నిశ్శబ్ద విరహ గీతాలాలపిస్తున్నవి!

కోయిలమ్మ - గొర్రె రాజేందర్

చరవాణి : 9491487882 అంశం : కోయిలమ్మ  -  గొర్రె రాజేందర్ కవిత  సంఖ్య : (78) కవితా శీర్షిక: నవతరం కోయిలమ్మ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! తనువు రూపు కన్నా తనకున్న ప్రత్యేకతతో జీవితంలో ఎదగాలనే ప్రేరణ కోయిలమ్మ తన రూపం నలుపైనా స్వరం సుస్వరం ఆత్మ విశ్వాసంతో అందలమెక్కి గాన గంధర్వ స్వరంతో మధుర గానం కుహు కుహు రాగాలు తీస్తూ ఆబాల గోపాలన్ని ఆనందపరుస్తూ ఆమని రాకకు పలుకును ఆహ్వానం చల్లని వెన్నెల్లో విరాహాగ్ని భరిస్తూ ప్రియునికై ఎదురు చూసే ప్రియురాలిలా వసంతం కోసం పరితపిస్తూ కోరికతో కోయిలమ్మ ఎదురు చూపులు రాలిన ఆకుల వైపు చూస్తూ నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా కష్టాలు ఎదురైనప్పుడు కలత చెందవద్దని కొత్త ఆశల చిగుర్లకై వేచి చూస్తే కొంగ్రొత్త వసంతం దరి చేరుతుందని సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమిటని సమాజానికి నవ సందేశాన్ని అందిస్తుంది ప్రకృతి పాడవుతున్నా పరిరక్షణకు పరిహారం ఆలోచింపక మౌనంగా విషాద గీతికలు పాడుతున్న మానవుని మనుగడ సాగేదెలా అని కఠినపు ప్రశ్నలు సంధిస్తుంది కోయిలమ్మ

కోకిలమ్మ - కోణం పర్శరాములు

చరవాణి : 9959524585 అంశం : కోకిలమ్మ  -  కోణం పర్శరాములు కవిత  సంఖ్య : (303) శీర్షిక : కమ్మని పాటల కోకిలమ్మ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! చైత్రశుక్ల పాడ్యమి మాసములో ఆమని వసంత రాకతో కేరింతలు కొడుతూ... నవ వసంతానికి స్వాగతం పలుకుతూ గున్న మామిడి కొమ్మల మీద పచ్చని హరితాల మాటున దాగిన ఓ.. కోకిలమ్మ మామిడి తోరణాలలో ఊయలలూగుతూ లేతమావి చిగుళ్ళను తింటూ మామిడి పిందెలు ఒగర్లచేత కమ్మని పాటలు మూటలచేత కుహు కుహు అని తీయటి పాటలు మత్త కోకిలవు నీవు సహజ సంగీత విద్వాంసు రాలువి నీవు. నీకు నీవే పల్లవి నీకు నీవే చరణం సంగీత సరిగమల చేత పిల్లల మనసు కుదుట పరుస్తావు కుహూ కుహూ అని పాడే నీ పాటకు పిల్లలే పల్లవౌతారు కూడు ఇచ్చిన ఆదేవుడు నీకు గూడు ఎందుకియ్యలేడో ? తీయని గాత్రాన్ని ఇచ్చిన ఆ భగవంతుడు నీకు ఆ నల్లని రూపాన్ని ఎందుకిచ్చాడో ? అండాన్ని ఇచ్చిన ఆ దేవుడు గుడ్లపై పొదిగితే భాగ్యం ఎందుకు ఇవ్వలేదో ? అమ్మ తనాన్ని ఇచ్చిన దేవుడు అమ్మ ప్రేమను ఎందుకివ్వలేడో సప్తస్వరాలను ఇచ్చిన దేవుడు స్వర్గ సుఖాలు ఎందుకివ్వ లేడో నీ జీవితం సుఖదుఃఖాల సంగమం కన్నీరుకు పన్నీరుకు మధ్యన ...

కోకిలమ్మ - కళావతి కందగట్ల....

కోకిలమ్మ  -  కళావతి కందగట్ల.... కవిత సంఖ్య...155 శీర్శిక...పచ్చని ప్రకృతి కోయిలమ్మా ! దిగులెందుకమ్మా కుహూ కుహూ రాగాలు నీ నోట వినిపించవేమిటమ్మా గున్నమామిడి చెట్టు గుబురు కొమ్మల్లోన లే చివుళ్ళు తింటూ మత్తు గా నీవు మధుర గీతాలు పాడే ఓ కోయిలమ్మా నీకు దిగులెందుకమ్మా ! పచ్చదనం పలుచ బడిందని వగచుతున్నావా ? పచ్చని చెట్లను నరికి వేస్తున్నారని బాధ పడుతున్నావా ? రాబోయే కాలంలో మీకు నిలువ నీడ లేక పోతుందని ఆవేదన చెందుతున్నావా? మనిషి స్వార్థపూరిత ఆలోచనలతో ప్రకృతికే హాని తలపెట్టి తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు తన తప్పు తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది పచ్చని చెట్లను పెంచుతూ ప్రకృతికి ప్రణమిల్లుతాడు ఓ కోయిలమ్మా ఇక దిగులెందుకమ్మా నీ కుహూ కుహూ రాగాలతో పచ్చని ప్రకృతిని పరవశింప చేయమ్మా ! కళావతి కందగట్ల

కోకిలమ్మ- డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి

కోకిలమ్మ- డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి రచన: కవిత సంఖ్య: 194 కవిత శీర్షిక:       ఆమనీ ...కోయిలా... వసంతకోయిల తనగానమాధురితో ఎదఎదనూ పరవశింజేస్తుంది ఆగి...ఆగి..కుహూ..కుహూ.మంటూ సాగిపొమ్మంటుంది  సందేశాన్ని వింటూ . ప్రకృతిని పులకరింపజేస్తూ నవోత్తేజానికి ఊపిరిపోస్తూ కొమ్మకొమ్మల్లో ప్రతిధ్వనిస్తూ తన ఉనికి చాటుకుంటుంది గున్నమామి కొమ్మలే తన ఆవాసం లేలేతచివుళ్ళే తన కమ్మని ఆహారం తీయతేనియ పాటకచేరీలే అనునిత్యం ఆమని అందాలన్నీ తనవే అన్నది అక్షరసత్యం ఒకోసారి కోయిలగొంతున కొసరేరాగాలు గుండెలుకోసే తీయని సరాగాలౌతాయి తెల్లారని రేయిలా ఎడారికోయిలలౌతాయి దాహంతీరని  వానకోయిలలౌతాయి ఛైత్రమాసం చైతన్యవంతమౌతుంది మావికొమ్మ చిగుర్లూ కోయిలమ్మ కబుర్లూ కవులకలాలలో గళాలలో చిందులేస్తాయి వసంతం కవులసొంతం అనిపిస్తుంది చక్రపాణి, అనకాపల్లి, విశాఖజిల్లా

కోకిలమ్మ - ఉదయశ్రీ ప్రభాకర్

కవిత సంఖ్య.248 అంశం.  కోకిలమ్మ  -  ఉదయశ్రీ ప్రభాకర్ కోకిలమ్మ రాగాలు చూపులకు అందని అందాలేవో మనసును చూరగొంటూ మురిపించగా ఆనందాల విందు చేస్తుంది ప్రకృతి పాఠశాలలో మృదు రాగలతో కోయిలమ్మ ఆమని తొంగి చూడగానే తరువులు చిగురులు తొడగగానే ప్రకృతి పులకరించింది పరవశాన కోకిలమ్మ రాగాలు తీస్తుంది ఆనందాలలో ఊయలలూగుతూ.. ఆకుల మాటున దాగి తన రూపుతో కనువిందు చేయకున్నా జల పాతాల  సవ్వడులకు తన రాగాలు జత చేర్చి సంగీత కచేరి చేస్తుంది మురిపంగా తన పాటలతో పంట చేలకు నాట్యం నేర్పితే తన స్వరాలకు గిరులు వంత పాడగా తన మధుర స్వరార్చనతో మురిపిస్తుంది.. పైరగాలిని వయ్యారంగా గంతులేయ మంటూ జగతిన స్వరాలెన్ని ఉన్నా నూతన స్వరాలెన్నో ఆనందాలలో మునకలేయించినా.. కోకిలమ్మ రాగాలకు  వంత పాడని గొంతులుండవు కదా..

కోకిలమ్మ - భాస్కర బాలభారతి

అంశము  కోకిలమ్మ  -  భాస్కర బాలభారతి శీర్షిక వసంతాగమనము కవిత. సంఖ్య 126 గూడుకట్టచేతగాని  కోకిలము కాకమ్మగూటినే పుట్టిల్లుగా. పురడోసుకోగా!! తరతమబేధములెరుగని కాకము తన అండాలతోసమంగా పొదిగీ   కూతలతేడాలతోనిర్థాక్షిణ్యంగా   కిందకుతోసేయ  తల్లిస్పర్శకూ పెంచిన మమకారానికీనోచుకోక రెంటికీ చెడ్డరేవడులై   పిల్లకోకిలాలుతల్లడిలుతూ ఆకలిదప్పులతో అలమటిస్తూ వెంటాడే వైరిపక్షుల తప్పించుక తిరుగుతూ ఏఏటినీటిలోనో మోముజూచుకున్నాఏమో ?? కాకిలాగవుంటారని లోకులంటారనీ. ఏకొమ్మ గుబురులమాటునో దాగిదాగి కుహూ కుహూయని అమ్మకైఆలపిస్తాయి !!! కొమ్మలరెమ్మల అమ్మ ఊయల ఊగూతూ గున్నమావిగుబురుచిగురుల మెక్కుతూ ఎన్నటికీతిరిగిరాని అమ్మకైతపిస్తూ కుహూ కుహూ రాగాలుతీస్తుంటే?ు  ఈడొచ్చిన గండుకోకిల తోడుకైతపిస్తూ తోటంతాతిరుగుతూ పిల్లలజాడకై తల్లికోకిల కాకమ్మల. గూళ్ళన్నీ వెదకుతూ ఎలుగెత్తి కూస్తుంటే ? వానిదీనాలాపనలు మనకు మధురాలాపనలా !! వానిఆగమనం.  మనకు వసంతాగమనమా !! ఎంతవిచిత్రం!! ఎంతవిచిత్రం

కోకిలమ్మ - జయంతి సుధాకర్.

సంఖ్య.54 అంశం..కోకిలమ్మ  -  జయంతి సుధాకర్. శీర్షిక...వసంత కోకిల. ******** ప్రకృతి పులకించి... వసంతం చిగురిస్తే, ఆనందంగా గళo.. సవరించిన కోయిల అతిథిలా విచ్చేసి, కమ్మని గానం తో వీనుల విందు చేస్తుంటే, అభినందనలంటూ.. నింగిలో సింగిడి, నాట్యమాడింది. బేద భావాలు లేని, కోకిలమ్మ వాణి కాకమ్మ గూడులో, సూరీడు సాక్షిగా గుడ్లన్ని పొదగేసి, ఐకమత్యానికి... ఆనవాళ్లు చూపింది. వర్ణానికి తెర వేసి గళానికి గాళమేసి, వర్ణిస్తే , కోకిల గానామృతం ఆమనినీ పులకరించి వసంతానికి...సాదరంగా స్వాగతమీయదా.... మదువొలకబోస్తూ!!!

కోకిలమ్మ - గజవెళ్ళి శ్రీనివాసాచారి

కవిత సంఖ్య: 235 అంశం: కోకిలమ్మ  -  గజవెళ్ళి శ్రీనివాసాచారి శీర్షిక: కోకిలమ్మ కూజితాలు ... కోకిలమ్మ గానం అమృత భాండాగారమే కోకిలమ్మ వర్ణం నలుపైనా గానం మాత్రం సుమధురం నేడు వినిపించవేమి వసంత ఋతువులో కోకిలమ్మ కూజితాలు పల్లెల్లో పెరళ్ళు కనుమరుగు మామిడి చెట్లు కరువు కోకిలమ్మలు ఎగిరిపోయె కరువయ్యె కుహు కుహు రాగాలు మామిడి చివుళ్ళు ఆరగించి మధుర గానం ఆలపించు కోకిలమ్మలు ప్రకృతి సౌందర్యం పక్షుల అందాలను తిలకించే కోయిల స్వరాలను వినే తీరికెక్కడిది నేటి జనానికి ప్రకృతిని ప్రేమిద్దాం పక్షి సంతతిని కాపాడుకుందాం ...

కోకిలమ్మ - రాయవరపు సరస్వతి

కవిత సంఖ్య: 205 అంశం: కోకిలమ్మ  -  రాయవరపు సరస్వతి శీర్షిక: వసంత గానం ********* వసంతమాసంలో విరబూసే ప్రకృతివణాలతో పా టూ కోయిలమ్మ ఆనందపారవశ్యంతో పాడే తీయని గానం వినసొంపుగా వీనులవిందుగా మనసు పులకించి తరింపజేసింది, కోకిలమ్మ నల్లనిదైనా గానం మధురాతి మధురం, ప్రకృతిలో వినిపించే ఆ తీయని గానం తో జంతుమృగాలు సైతం శిల వంటి కఠిన హృదయులు కూడా  వెన్నలా కరిగిపోవలసిందే, కోకిలమ్మ వయ్యారాలు పోతూ కూసే తీయని గానంతో సురలోకవాసులుకుడా మురిసి మైమరచి వరుణుడు దయ తలచి కురిపించే వర్షాధారతో భూదేవి సంతసించి సకల ప్రాణికోటికి అన్న దాహార్తులను సమకూర్చి చల్లని దీవెనలు ప్రసాదిస్తుంది, ********** రాయవరపు సరస్వతి చోడవరం, విశాఖా

కోకిలమ్మ - Yamsani Soumya

అంశం: కోకిలమ్మ శీర్షిక:నీ పాట పంచామృతం ఆకురాల్చిన తరువులకు  ఊపిరి పోస్తూ, చిగురులు తొడిగిన వసంతపు చిన్ని చిన్ని అందాలతో ఆమని తడిసిపోగా, కేరింతలతో భ్రమరాలు ఝుంఝుం నాదాలు చేయగా కొత్తచిగురు తొడిగిన చెట్టు కొమ్మ మాటున మదినిదోచే ఓ కొంటె రాగం కుహూ-కుహూ మంటుంది. ఎంత వినినా తనివి తీరని రాగమది, మనసును మైమరపించే మధురగానమది, ఆమనినే పులకరింపజేసే బంగరు గొంతుకది, తన మేని రంగుకు అందని అపురూపరాగమది. చైత్రమాసపు వెలుగులో ప్రకృతి అందాలకు సొబగులద్దుతూ కడు రమణీయంగా కూస్తుంది ఆ కోకిలమ్మ, పల్లెతల్లి ఎదలో ఒదిగే బంగరుబొమ్మ.. పిల్లల అల్లరి మాయం చేస్తూ సాగే ఆ గీతం, మరల మరల వినాలని కర్ణములు తాపత్రయపడగా, కవుల కలములకు సువర్ణవస్తువై విరాజిల్లుతూ, మధురగానానికి చిరునామాగా తన నామమే నిలుపుతూ తెలుగు సంవత్సరాధిని తన సరిగమల స్వరాలతో ఆహ్వానిస్తూ, కొమ్మ చాటు కోకిలమ్మ కుహూకుహూ మని ఆలపిస్తూ ఉంటుంది.

కోకిలమ్మ - ఏడెల్లి రాములు

అంశం* కోకిలమ్మ  -  ఏడెల్లి రాములు శీర్షిక* కోయిలా పాడవే హాయిగా కోయిలా పాడవే హాయిగా ఆమని నీ మణిహారమేగా కోయిలా పాడవే హాయిగా ఎన్నెన్నో రాగాలు పోతావు చిన్నారుల గేయమై వస్తావు పున్నమి వెన్నెలై పూస్తావు చైత్రమై చిత్రాలు తెస్తావు కోయిలా పాడవే హాయిగా// శిశిరాన్ని మరిపిస్తావు వసంతమై  కొమ్మల్లో వాలుతావు పలుకు పలుకుల్లోనా గమకాలు పాడేవు గానే కోకిలమ్మవై లోకమేలుతుంటవు ఎంతెంతో రస మాధుర్యం కవులకిది కమనీయ కావ్యం జానపదుల జావళివై ప్రేమికుల రసగుళికవై ఆ నోటా ఈ నోటా ఆచ్చెరువొందిన పాట గోదారి అలలపై పదనిసలైన జాలువారే జలధార కమ్మని కొత్త చిగుళ్లలో తీయని రాగమై బావాల ఆరావళీ అందాల జాబిలి గీతమై కునుకు కునుకు లో కువ కువలయ సంగీతం నేరేడు మామిడి ఈత పాల పళ్ళలో నీ తీయని రసమాధుర్యం కోయిలా పాడవే హాయిగా వేవేల బాల గొంతుకల తీరుగా నీ పాటలో మధురిమలు నీ వాలిన కొమ్మల్లో కొత్త ఊసులు మా మనసంతా దోచుకున్న కోకిలమ్మా మా మనసుపూల కొమ్మల్లో వాలవమ్మా ఏడెల్లి రాములు ది*21*06*2019(12*50) ఎల్కలపెల్లి

కోకిలమ్మ - అన్నాప్రగడ వేంకట నరసింహారావు..

సంఖ్య..233 అంశం.కోకిలమ్మ  -  అన్నాప్రగడ వేంకట నరసింహారావు.. శీర్షిక..గానామృతం వసంతరుతువు ఆగమన సమయాన.. అవనికి ఆమని సందేశం అందువేళ.. రెమ్మలు తొడిగిన కొమ్మల మధ్య ఎవరో చిగురులు మేయుచున్నట్టుంది.. మానులు పిందెలతో నిండుగా కనిపిస్తుంటే,గిరగిరా భ్రమరాలు తిరుగుతుంటే కుహు కుహు మంటూ ఎవరో గానంచేస్తున్నట్టుంది.. ఆ గానం అమృతం చిలికిస్తున్నట్టుగా, నల్లనయ్య పిల్లనగ్రోవి వూదుతున్నట్టుగా సుమధురంగా ఉంది.. ఆ గానామృతం అందించు జీవికి నిలువ నీడలేదేమో కాకమ్మ గూళ్లను అద్దెకు తీసుకుంటూన్నాయి.. అంతటి గొప్ప కళాకారిణికి శాఖాహార, మాంసాహార బేధము తేలియదేమో ఆహారంలో పండ్లతో పాటు, క్రిమికీటకాలను ఆస్వాదిస్తున్నాయి.. వింతైన ప్రపంచంలో ఎన్నో జీవరాసుల్లో గానామృతం అందించు కోకిలమ్ముకు కోటిదండాలు.. ✒అన్నాప్రగడ

కోకిలమ్మ - మాధవీసనారా

అంశం:కోకిలమ్మ - మాధవీసనారా శీర్షిక:కోకిల నా కిష్టం కవిత సంఖ్య:165 ^^^^^^^^^^^^^^^^^^^^^ చైత్రమాసంలో విడుదలయ్యే వసంతరుతు చిత్రానికి కోయిలపాటే నేపధ్య సంగీతం కుహు కుహు అనే రెండు మాత్రల వసంతగీతమాలపించే గాయని గుబురు సామ్రాజ్య ఆస్థాన సంగీత విద్వాంసురాలు మావిచిగురు తినగానే గాత్రశుద్ధి జరుగుతుందో ఏమో గొంతెత్తి పాడుతుంది మావిడాకుల శ్రోతలు కనబడగానే పరవశించి పాడుతుంది ఏ బాదరబందీ తలకెత్తుకోకుండా సహజీవనంతో గడిపే ఆధునిక యువతకి మార్గదర్శి అండం పొదిగే విద్య తెలియని అమాయకురాలు పుట్టని పిల్లకి లాలిపాడే తల్లికాని తల్లి కోయిలమ్మ చినుకు చాతకపక్షికి చిగురు కోయిలమ్మకి ప్రీతి కాకి కంసుడి ఖైదులో జన్మించే కోకిల కన్నయ్య గానమంటే ఇష్టపడనిదెవరు కవులకి మరీ ప్రీతి కోయిలమ్మంటే నాకు వసంతమంటే ఇష్టం కోయిల కూజితమంటే మరీ ఇష్టం. మాధవీసనారా, అనకాపల్లి విశాఖపట్టణం జిల్లా

కోకిలమ్మ. -డా.కె.ఎల్.వి.ప్రసాద్

అంశం <<>>కోకిలమ్మ. -డా.కె.ఎల్.వి.ప్రసాద్ శీర్షిక <<>>,గా న రవళి * కవి<<>>డా.కె.ఎల్.వి.ప్రసాద్ గాన రవళి * ఆ ..స్వరం , ఎక్కడో విన్నట్టుగా ఉంది . విన్నకొద్దీ .. వినాలనిపించే ఆ ..స్వరం, ఉగాది ఆగమనాన్ని సూచిస్తూ ఊరూరా ... మధుర గీతాలని , అహ్లాదంగా ఆలపించినట్టు ఉంది , కమ్మని ... కోకిలమ్మ గానంలా ఉంది ! పూల పరిమళంలా ... వాయువేగంతో పోటీపడుతున్న , ఆ ..స్వరమాధుర్యం, నేనుకోరుకున్న .. నా ..ప్రియ సఖి .... ఆనంద గమనపు ... అనవాళ్ళు లా ... నాకు హెచ్చరికల పంపిస్తున్నాయ్ ...! నిజమే ...అది, అల్లంత దూరాన నిలబడి , చెలికత్తెలతో ... సరస సంభాషణల్లో నిలువెత్తు మునిగిపోయిన , ఆ ..కోమలి ... మధుర సంభాషణమే ! ఆ ..కోకిలమ్మ ... మధుర గాన రవళి లా , హృదయ భాషతో మత్తిల జేస్తున్న నా ..మానస ... పూబోణిదే ....!! __ డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,            హనంకొండ.

కోకిలమ్మ -పత్తిపాటి రూపలత

పత్తిపాటి రూపలత అంశం -- కోకిలమ్మ -పత్తిపాటి రూపలత అంశం -- కోకిలమ్మ శీర్షిక -- వసంత రాగం సంఖ్య -- 116 ***** ఆమని కను సైగతో వసంతం మొగ్గతొడిగేను అంబరం నీలి మేఘాలతో హాయి హాయిగా సాగేను శిశిరమున మోడులన్నీ చివురలతో కనువిందుజేసెను పచ్చ పచ్చగా ప్రకృతి పరువాలు ఆరబోసేవేళ ఏ కొమ్మలో దాగుందో రాగాల కోయిల తన గొంతు సవరించి రాగమందుకొంది తీయటి చివురులు తిని మత్తకోయిల మత్తుగా కొమ్మెక్కి కూసింది ఏ పూలతో దేవుని పూజించినదో రాగాల స్వరమిమ్మని రతనాలే పోసిందో తేనెతో అభిషేకించి ఆ అమృత స్వరాన్ని పొందినదో తెల తెల వారకముందే ఆ కుహు రాగాలతో లోకానికి సుప్రభాతం పాడింది సమస్త జనులను తన రాగానితో వశపర్చుకుంది తనకంటే గొప్పదవుందని తలిచాడేమో ఆ పైవాడు నల్ల రంగునలమి అంద విహీనం చేసాడు అందం లేకున్నా ఆ మధుర రాగాన తేలి జగాన్ని మత్తులో ముంచెత్తి కోయిలమ్మ అమనికే సంకేతమవ్వలేదా వన్నెల వసంతానికి గుర్తుగా మిగిలింది కదా !! ******** 🖋అద్వైత 🖋

కోకిలమ్మ -మద్దెల సరోజన

మద్దెల సరోజన (కలం: సహజ) క్రమ. సం: 81 అంశం: కోకిలమ్మ  -మద్దెల సరోజన శీర్షిక: వసంత గాన కోయిల """"""""""""""""""""""""""""""""""""""""""""" స్వస్థలాన్ని వీడి పర ప్రాంతం చేరి తన పర బేధం మరచి షడ్రుచులు మేళవింపైన కుహూకుహూ రాగాలాపనతో నవ వసంతుడికి స్వాగతం పలికే వలస సంగీత రాణి కోకిలమ్మ రాగాల వీణగా కర్ణానందం కలిగిస్తూ మావితోటల్లో చివురులు తింటూ చిలిపి పాటలతో హాయిని పెంచు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ తుంటరి పిల్లలతో గొంతు కలపే గడసరి  సొగసరి పంతులమ్మ కాకి కోకిలలు తోబుట్టువులు కాదే..ఐనా కాకి గూటిలో గ్రుడ్లు పెట్టి సమతమమతలు చాటే సమన్విత అవనికి ఆమని సొగసులు తెచ్చే ప్రకృతికే పాటలు నేర్పే సంగీత విద్వాంసురాలు సదా వసంతాన్ని ఆహ్వానించే సహృదయ వసంత గానకోయిల

కోకిలమ్మ Vittala Sreekantha Sharma

అంశం.కోకిలమ్మ కవితసంఖ్య260 శీర్షిక.పంచమస్వరం తేది.21-06-2019 ********** సంగీతంలో పంచమస్వర ఉద్గమస్థానమిచ్ఛి వసంతాగమ స్వాగతసూచక బాధ్యతనిచ్ఛి.. ప్రకృతిశోభను ఇనుమడింపచేసే గౌరవమిచ్చినవాడు ఎంతోపెద్దలోటు ఒకటిపెట్టి సంసారానందానికిదూరంచేశాడు కాకులగూళ్ళలోగుడ్లుపెట్టించి పొదగటంచేతకానితనాన్ని అంటగట్టి బాధ్యతారాహిత్యాన్నిబిరుదుగాఇచ్చి కాకులకంటే కడహీనం చేసినాడు. పంచమస్వరం సంగీతమా సంతానంకోసంపిలిచే ఆర్తిగీతమా... వసంతరుతుశోభనుఎలిగెత్తిచాటేకుహూస్వనానికి ఈవికృతవర్ణ రూపమేమి... కాకికీ కోకిలకూఒకే రంగేమిటి ఏమోసృష్టిరహస్యం..అంతుబట్టదు. మావిచిగుళ్ళుమేసినా మాధవమాసాన్నిమోసినా స్వంతసంతానాన్నిలాలించే తృప్తిలేదుకదా...!