కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్
అంశం: కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్
శీర్షిక : గాన కోకిల
********
కొమ్మల చాటున దాగిన కోకిల
కుహు కుహు అని పాడేవు
నలుపంటు నవ్విన నీ ఒంటికే కానీ
మధురమైన గొంతుతో మైమరపించేవు
వసంత కాలం రాగానే వలపుల పిలుపులు పిలిచేవు
లేతమామిడి చిగుళ్ళు తింటూ
చిలిపి చేష్టలు చేసేవు
అనువుగాని చోట మూగనోము నోచి
అదును చూసి రాగమాలపించేవు
చేనుచెలకల్లోన చెమటోడ్చే రైతన్న
నీపాట కొరకు పరితపిస్తున్నారు.
మా మనసు రంజింప
మౌనము విడనాడి
అలసట తీర్చగా ఆలపించగ రమ్ము
ఎవరు నేర్పారమ్మ నీకీ గాత్రము
ఆమనిని చూడగానే పరవశమొందేవు చిత్రమూ
సాధనా లేకనే సరిగమలు పలికేవు
తాళమేయకున్న లయ నీవు తప్పవు.
గాన గంధర్వులు
నీకు సాటిరారు
గాన కోకిలంటూ బిరుదును ఇచ్చేరు .
ధన్యమేనమ్మా నీ పక్షి జన్మ
మనుజమాత్రులయిన
నీ సాటి రారమ్మ.
Comments
Post a Comment