కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.


అంశం: కోకిలమ్మ  -  కాసనగొట్టు స్వప్న.
శీర్షిక: గాలిస్తున్నా...
కవిత సంఖ్య: 226

***********
 రంగుతో ఒరిగేదేముందంటూ
రాగాలతో రోగాలు పొగొట్టిన నేస్తానికై గాలిస్తున్నా...

ప్రభాతమునే పచ్చనికొమ్మల దాగి
కుహూ కుహూ అంటూ గొంతెత్తి
దాగుడుమూతలాడే కోకిలమ్మకై గాలిస్తున్నా...

తన గాత్రమాధుర్యంతో
తనువు పులకరింపజేసి
పరవశాల ఊయలూపే పక్షిచెలియకై గాలిస్తున్నా...

మాయమైన తరువుల ఎడారిలో
మానవతలు మరీచికై మొలచిన సెల్ టవర్లతో
మూగబోయిన మిత్రురాలి రాగాలజోలకై
మిడుకుతూ మిణుగురుపురుగునై
గాడాంధకారంలో గాలిస్తున్నా...

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి