Posts

Showing posts from July, 2019

పత్రహరితం - మద్దెల ప్రభాకర్

అంశం :పత్రహరితం  -    మద్దెల ప్రభాకర్  శీర్షిక:  "చిగుళ్ళు" ******** వనమంతా వికసించింది వర్షపు చిరుజల్లులతో  కొంగొత్త హోయలు ఒలకబోస్తూ పులకరింపులతో  జడివాన కురువుగా చిగురించే మోడువారిన మాను యవ్వనాన కొత్తసొగసులద్దినట్టు పుట్టుకొచ్చే చిగుళ్ళు  చిలకలు చేరి  కొమ్మను వాలే  చింత పొగరుగా చిగురు వేసే  పచ్చని పత్రదలములు, ఫలములతో నిండెను మేను  వరుని కొరకు వేచే కన్నెలా అందరినీ ఆకర్షించే, జీవులన్ని  మాను చెంతకు చేరి  ఫలములనారగించి నీడలోన  సేదతీరి  చెట్టును రక్షించ ప్రతిన బూనే.

పత్ర హరితం - వురిమళ్ల సునంద, ఖమ్మం

పేరు:: అంశం::పత్ర హరితం  -   వురిమళ్ల సునంద, ఖమ్మం శీర్షిక::పచ్చగ బతుకు... సంఖ్య::287 !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! లేలేత కిరణాలతో దోస్తీ చేసి ఎంత చక్కగా హరిత ఆహారం  తయారు చేసుకుంటాయో కదా! బిడ్డల క్షేమానికి తపించే తల్లిలా విషాలు కాలుష్యాన్ని మింగి విశ్వ క్షేమానికై గరళం మింగిన శివుడవుతుంటాయి.. ప్రాణవాయువును  పచ్చ(ద)ధనపు పత్ర హరితాల్లో  దాచి పంచి పెడుతుంటాయి అవనంతా ఆరోగ్య నిలయం కావాలని‌‌.... కొమ్మ రెమ్మల పానుపేసి  రేపటి తరాన్ని పత్ర పొత్తిళ్ళలో సాకడానికి విత్తనమై మొలకెత్తడానికి.. "ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ" ఓ మహా కవి అన్నట్టు  సృష్టి రచన ఎంత గొప్పదో కదా! చినుకు పడితే చాలు భూసతి బుగ్గల్లో ఆకుపచ్చని నిగ్గులు అణువణువునా పత్ర హరితాల పల్లవింపులు... ఏ మొక్క చరిత్ర చూసినా తెలిసేది ఒక్కటే... మనుషులమైన మనకు చేసే నీతి బోధ ఒక్కటే.. పత్ర హరితమా  హరిత పత్రమా కుడి ఎడమైనా పొరపాటు లేకుండా చెప్పెది ఒక్కటే.. పచ్చగా బతుకు బతికించు సమాజ కాలుష్యాన్ని నివారించు..

పత్ర హరితం - మన్నవ పద్మ

కవితా సంఖ్య:12 అంశం: పత్ర హరితం -  మన్నవ పద్మ శీర్షిక: అనియత్ గురువు ఆది నుంచి మానవుని అక్కున చేర్చుకొని కుక్షి బాధ తీర్చి వలువై కౌగలించి తోడు నీడ అయి లాలించి పాలించింది పచ్చదనం  అడుగడుగున తానే అక్షయమై అండగా నిలిచింది. ధరలోన తన వారసులైన  పత్ర ఫల పుష్పాలను సంఘ సేవకు అంకితం చేసి అమ్మలకే ఆదర్శమయ్యింది శంఘ జీవనం మనకు అనాదిగా నేర్పుతూ పొరుగు వారికి సాయపడమని చేస్తూ చెప్తోంది అకుంఠిత దీక్ష తో అలుపన్నది ఎరుగక స్వచ్ఛమైన శ్వాస అయి కళ్ళకు పచ్చని చలువై చక్కని వరాలిచ్చి బ్రతుకు పాఠశాలలో అనియత గురువై పాఠించి నేర్పుతుంది పచ్చని ప్రథమ గురువుకు అంకురార్పణ చేసి ప్రాణంగా పెంచాలి !

పత్రహరితం - వై.కె.సంధ్యశర్మ

ఊరు: చిత్తూరు సంఖ్య:.84 అంశం : పత్రహరితం  -   వై.కె.సంధ్యశర్మ శీర్షిక:హరిత హారం! ఛత్రమై నీడనిస్తూ చెక్కిన శిల్పంలా సోయగాలను పంచుతూ ఇంద్రధనస్సు రంగులన్నీ ఒంటికి హత్తుకుని రామ చిలుక సొగసులన్నీ తనువంతా ఒంపుకుని మాగాణి పంటకు  హరిత హారమైనావే! రవికాంతుని రేఖలనే నుదుటి గీతలుగా మార్చుకుని అణువణువూ మా శ్వాసకు నిచ్ఛ్వాసవైనావే! లేలేత పసిడి మొగ్గల ఛాయతో నీరజాక్షుని కొలిచి చిరుజల్లు కురిపించే కొంగు బంగారమై పవన తరంగాలను వెదజల్లే వసుధవు నీవే! ప్రకృతి గీతం పాడుతూ పర్యావరణ సంరక్షులుగా మా మాటలన్నీ  నీటి మూటలుగా నీకు కంచె వేశాము! కంచే చేను మేసినట్టు విత్తు లేని చెట్టు ఎదగాలని మా నీడను నిలువునా నరికేస్తున్నాము! హరిత రేణువులన్నీ హరించేలా కల్మషపు కాలుష్యాన్ని  నింపేస్తున్నాం! రేపటికి తరానికి ఓ పాదు తీసి బంగరు భవిష్యత్తుకు  ప్రాణవాయువు నందించే పత్రహరితాల్ని అందిద్దాం!! అందరం ఆనందంగా జీవిద్దాం!!

పత్రహరితం - నల్లు. రమేష్

పేరు:-నల్లు. రమేష్ కవితా సంఖ్య:-143 అంశం:-పత్రహరితం  -  నల్లు. రమేష్ శీర్షిక:-"బోన్సాయి బ్రతుకులు" "తోటంతా   తరలి పోతుంది  కుండీలు కుండీలుగా  ఈనెల చేతులు  స్వార్ధానికి చిక్కి  పలచ బడిపోతున్న  ప్రేమ హరితం  గాజు గోడల మధ్య  కుదించుకు పోతున్న  రంగుల జీవితం  అద్దెకు తెచ్చుకున్న  గాలి పొరలలో  అర్ధాంతరంగా ముగిసి పోతున్న  బోన్సాయి జీవితాలు  ముసలితనంతో  తోట ముడుచుకు పోతుంది  పచ్చని ఆసరాకై  పరితపిస్తుంది  కుటుంబంలో  అనుబంధాలు ఆప్యాయతలు  అడవులై రాలిపోతుంటే  సమాజమంతా  హరితం ఆవిరైన  కుటుంబ ఆకులే కదా!"

పత్రహరితం - ఎడ్ల . లక్ష్మి

అంశం పత్రహరితం  -   ఎడ్ల . లక్ష్మి కవిత .సంఖ్య.166  శీర్షిక : ప్రభావం ☘☘☘☘☘☘☘☘☘ పచ్చని లతలతో పారిఉన్న పందిరి ఇంటికెంతో అందం గుమ్మానికి మామిడి తోరణాలందం పచ్చని చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ హరితానందం పూర్వం ప్రవోజనంలో మోతుకాకు విస్తారాకులో బొజనం వడ్డన చేసేవారు విస్తారాకులోని భోజనం అరోగ్యానికి ఎంతోమేలు జరుగుతుందని పెద్దల నమ్మకం ఇప్పుడు కాగితం విస్తార్లు వాటిలో తిండి దండి ముప్పు పచ్చటాకుల గూర్చి ఇక ఎన్నెన్నో కరివేపాకు కొత్తిమీర పూదీన చెన్నంగి ఆకు పుంటాకులు కలిపి రోటీ పచ్చెడ చేస్తే ఎంత రుచి కడుపు నిండ భోజనం కంటి నిండ నిద్ర ఇది పత్రహరత ప్రభావం

పత్రహరితం - కటుకం కవిత

పేరు:కటుకం కవిత తేది: 20/6/2019 అంశం: పత్రహరితం -  కటుకం కవిత కవిత సంఖ్య:235 కవిత శీర్షిక: నేలమ్మకు పచ్చలపథకం మానవాళికి ఆధారం చెట్లు జీవకోటి ప్రగతికి అవే కదా తొలిమెట్లు... పర్యావరణాన్ని రక్షించి పత్రహరితాల పచ్చదనంతో సతతహరితాలకు బాటలు వేయడం ప్రతిఒక్కరి లక్ష్యం కావాలి అవనియంతా పచ్చని తివాచీతో పరిఢవిల్లాలి...!! మానవమనుగడకు చెట్లు చేయని ఉపకారమే లేదు... పచ్చని పత్రహరితాలతో కంటికి వెలుగుగా... అలసిసొలసిన మేనుకు విసనకర్రగా... ఔషధమొక్కగా వైద్యము చేయుచు ఆరోగ్యప్రదాయినిగా... పుట్టుక నుండి కడదాకా  తోడునీడగా సాగే ఆప్తమిత్రులు తరువులు...!! మానవత్వంతో మేల్కొని మనుషులమంతా ఒక్కటై కరువులను పారద్రోలే తరువులను ఆధునిక అశోకులమై నడుం బిగించి ఉద్యమంగా పెంచుదాం... పుడమితల్లికి పత్రహరితాల పందిరి వేసి ప్రకృతిమాతకు హరితహారాల మాలతో అలంకరించుదాం...!! ప్రాణవాయునిచ్చి పండ్లూఫలాలతో ఆకలితీర్చే తరువులను విరివిగా పెంచి వనసంరక్షణయే జనసంరక్షణగా ఎంచి ఊరంతా వనాలతో పచ్చదనపు సిరులతో సమతుల్యత కాపాడుదాం... తరతరాలకు తరగని సంపదగా చెట్లనే ధనముగా భావితరాలకు అందిద్దాం... నేలమ్మకు పత్రహరిత పచ్చ...

పత్రహరితం - వినీల దుర్గ

కవితా శీర్షిక : పత్రహరితం  -  వినీల దుర్గ కవితా సంఖ్య : 196 తేదీ : 20/06/19 మనసుకు ఆహ్లాదం జగతికి శోభాయమానం పర్యావరణ కు ఆరోగ్యం జగతికి ప్రాణాధారం...!! ప్రకృతి మెరియు పడుచుపిల్ల సొగసుల తో అందం పూరెమ్మలకు కనువిందై మెలుగు జీవనం మానవాళికి ఎన్నో ఔషధాల మూలం...!! కరిమబ్బు చినుకై ముద్దాడలన్నా అవసరం రైతన్నకు సేదతీర్చాలన్నా ముఖ్యం పత్రహరిత వనాలు సకాల వర్షాలకు చల్లగ వీచే పవనం....!! పెంచండి విరివిగా మొక్కల పెంపకం భావితరాలకు కళకళ లే నీటి వనరుల సోయగం మనకందరికీ అంతులేని ఆనందం....!!

పత్ర హరితం - చిందం సునీత

చిందం సునీత తేది: 20/6/2019 అంశం: పత్ర హరితం  -   చిందం సునీత కవిత సంఖ్య: 175 కవిత శీర్షిక: పత్ర హరితం పత్రహరితంతో నిలవాల్సిన ప్రకృతి పచ్చదనం వర్షాలు కానరక కరువు కాటకాలతో కష్టాలు కొనితెచ్చుకోవడం చేతుల కలిన0క ఆకులు పట్టినట్లు0ది! మొక్కలు నాటక, చెట్లను పెంచక ప్రకృతి కోసం అర్రులు చాచడం అవివేకం! ఇప్పటికైనా మొక్కలు నాటండి మానవులరా! సర్వప్రాణులు బ్రతకాలంటే జీవంపోసే హరితవనాలను పెంచాలి! ప్రాణవాయువునిచ్చి పర్యావరణాన్ని కాపాడే పత్రాలు విస్తారంగా విస్తరించాలి! పచ్చదనం తెచ్చి ప్రగతినంతటిని కాపాడాలి!!. రచన: చిందం సునీత కోరుట్ల.

పత్రహరితం - గజవెళ్ళి శ్రీనివాసాచారి

గజవెళ్ళి శ్రీనివాసాచారి కవిత సంఖ్య: 234 అంశం: పత్రహరితం  -   గజవెళ్ళి శ్రీనివాసాచారి శీర్షిక: సహజ సిద్ధ యంత్రాలు ... హరిత పత్రాలు కాలుష్యాన్ని హరించే సహజ సిద్ధ యంత్రాలు పుడమిని పచ్చందాలతో అలంకరించే పత్రాలు సూర్య కిరణాలను సంగ్రహించి కిరణజన్య సంయోగ క్రియతో ఆహారాన్ని తయారు చేస్తూ తల్లి చెట్టుకు అందించే పత్రాలు వినాయకుడి పూజలో వాడే పత్రాలన్నీ ఓషధ గుణాలున్నవే అది మన సంప్రదాయంలో ముడిపడిన విశిష్టత మండుటెండలో ప్రాణికోటికి గొడుగులై అమ్మగా సేదతీర్చు అభివృద్ధి పేరిట హరిత వనాలు హరిస్తూ ప్లాస్టిక్ చెట్లతో ఇంటిని అలంకరించే సంస్కృతి నేడు  ... గజవెళ్ళి శ్రీనివాసాచారి

పత్ర హరితం - ఐరేణి కృష్ణవేణి

అంశం:పత్ర హరితం -  ఐరేణి కృష్ణవేణి శీర్షిక: పుడమి అందం కవిత సంఖ్య:21 తొలకరి చినుకులతో పులకించిన అవని పచ్చని ప్రకృతిని మానవాళికి మనోనేత్ర సుందర రూప తివాచీని పరిచి పెడుతుంది! పశువులకు పచ్చని పంచభక్షపరమన్నమై పండుగలా విందునిస్తుందీ! పక్షులకు గుబురుల గూడులతో ,లేతచిగురుల ఒత్తికలను ఇచ్చి,కిల కిల రాగాల పుష్పమధురిమల తోటవుతుందీ! పంటపొలాలకు ఆకుపచ్చ రంగును అద్దకం వేసీ.. ఆకలి చూపుల  పసిబుగ్గలకు అమ్మ చీర కొంగులో దాచితెచ్చిన  పంట సిరుల కమ్మని  పాల బువ్వవుతుందీ! ఏ ఋతువుకు ఆ ఋతువుల పూలు, పండ్లతో పేరంటానికి స్వాగతాలు పలుకుతుంది! మనిషి హరిత వనాలను కాపాడుకుంటే.. పుడమి పై పత్రహరితాలను పాన్పుగ పరిచీ.. జగతి సిగను మెరిపిస్తుందీ! జీవరాసులను కాపాడుతుందీ!!

పత్రహరితం - డా.బల్లూరి ఉమా దేవి.

డా.బల్లూరి ఉమా దేవి.  కవితా సంఖ్య :167 అంశము: పత్రహరితం  -   డా.బల్లూరి ఉమా దేవి. శీర్షిక:పులకరింత హరిత భరితమైన తరువులను చూడ  ఉప్పొంగు హృదయము సంతసాన తొలకరి చినుకులు తనను తాకగానే  ఎండి బీటలు వారిన పుడమి తల్లి  చిన్న మొలకలతో అగుపించి మురిపించి హాయి కూర్చును మానవాళి కెల్ల ఆకుపచ్చని కోక కట్టిన రీతిగా  ప్రకృతి కాంత తనువెల్ల హరిత భరితమవగ ఆమని శోభయే అవనిలో నిండగా పక్షి జాతి మురిసి పరవశాన  ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ ఆకుపచ్చగమారి పులకరించినట్లు తలలనూపి బాటసారులకు పచ్చగడ్డితో పానుపై  పరవశింపజేసి అలసటను బాపు కూరగాయలైన పూల తరువులైన అరిటాకు లైనను పనసాకులైనను తులసి మొక్కలైన తమలపాకు తీవైన హరిత పత్రములతో కనువిందు చేయుచు శాంతి కూర్చు మదికి జగతి యందు. డా. బల్లూరి ఉమాదేవి  20//6/19/

పత్రహరితం -సుభాషిణి వెగ్గలం

పేరు :సుభాషిణి వెగ్గలం కవిత సంఖ్య :76 అంశం :పత్రహరితం - సుభాషిణి వెగ్గలం శీర్షిక :ఆరోగ్య ప్రదాయని హరితం.... విన్నా కన్నా ఆహ్లాదమే పచ్చని పొదలతో అల్లుకొన్న హరితం మనసులను మురిపించి మనో రుగ్మత లను దూరం చేస్తుంది నేలమ్మ నీరమ్మ సూరన్న సాక్షిగా చిగురులు తొడిగిన హరితం పలువన్నెల ఫలముల తీరొక్క రుచుల రూపుదాల్చి జిహ్వను మురిపించి గుండె గూటిలో పదికాలాల పాటు కొలువుండే ఆరోగ్య ప్రదాయనవుతుంది అందమైన సీతాకోకగ రూపు మార్చుకొను గొంగళి పురుగుకి ఆహారమిచ్చి ఆధారమవుతుంది కొమ్మలై రెమ్మలై రారమ్మని పిలిచేరాగమై నీడనిచ్చు హస్తమై కనువిందు చేయు కువకువలకు హరితవనాల నెలవవుతుంది ఆదర్శ

పత్ర హరితం -సోంపాక సీత,

పేరు: సోంపాక సీత కవిత సంఖ్య: 184 అంశం: పత్ర హరితం  - సోంపాక సీత, శీర్షిక: కవల పిల్లలు ******* ప్రాణవాయువుని పంచే పత్రాలు పదుగురికీ మంచి చేసే నేస్తాలు సోమరితనాన్ని దుమ్ముదులిపే అస్త్రాలు స్వావలంబనకు సజీవ సాక్ష్యాలు ఆప్టిక్ నెర్వ్ కు ఆలంబనా వర్ణాలు ఆమ్లజనిని పంచే ఆరోగ్యద్వారాలు పర్యావరణాన్ని కాపాడే పత్రాలు కాలుష్యాన్ని కాలరాసే దివ్యమంత్రాలు పత్ర హరితం,పచ్చదనాలు జంట కవలలు జీవకోటిని నడిపే ప్రాణదాతలు వృక్ష సంరక్షణకై పెట్టుకోవాలంతాఒట్లు దేశ ప్రగతికివే గదా తొలి మెట్లు.....                            స్ఫూర్తి రత్న              భద్రాచలం.

పత్ర హరితం - బి.సుధాకర్

పేరు. సంఖ్య..294(20-6-2019) అంశం..పత్ర హరితం  -   బి.సుధాకర్ శీర్షిక..ఆకు పచ్చ  అందరు మెచ్చ పుడమి తల్లి గర్భాన పురుడుపోసుకొని పత్రహరితంతో ప్రాణం నింపుకొని లేతపచ్చని చేతులతో ప్రణమిల్లుతు పైకివచ్చి ప్రాణవాయువునివ్వ పదిలంగా పెరిగింది బోసినవ్వులు చిందించే పసిపాపలా ముసి ముసి నవ్వులతో ముందుకు వచ్చే మొక్క నేలతల్లికి పచ్చని ఆకులతో అల్లిన చీరతో ప్రకృతి ఇంట పండగ చేయ సందడి పెంచే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అందరు వేసే ఒట్టు పచ్చగ పెరిగే చెట్టు నరికేవారిని కనిపెట్టు మారకపోతే పనిపట్టు కరువు రక్కసీ రావద్దంటే పచ్చని చెట్టు నిలబెట్టు నల్లని మేఘం రావాలంటే చెట్లను పెంచి చూపెట్టు కదిలే గాలి చల్లదనానికి నడుంభిగించ తలపెట్టు పర్యావరణం పచ్చగ ఉంటే రోగాలెప్పడు దరిరావు పచ్చని చెట్లు ప్రాణంగుంటే ప్రజాజీవితం శాంతిని పొందు భానుడి తాపం పెరగొద్దంటే మనిషిలో మార్పురావాలీ పచ్చని చెట్లు ఉండాలంటే ప్రజల ఆశలో చెట్టుండాలి

పత్రహరితం - కె.ఎల్.సరోజారెడ్డి

రచన   : కె.ఎల్.సరోజారెడ్డి అంశం  : పత్రహరితం   -   కె.ఎల్.సరోజారెడ్డి శీర్షిక     : హరిత సోయగం సంఖ్య  :  260 తేదీ      :  20/6/19 ********** ఆకులన్నీ రాలిపోయి మోడై విలపిస్తున్న వృక్షాన్ని చిన్నారి చిగురులు చిరునవ్వుల సంతకాలతో మురిపిస్తాయి... చెట్టమ్మకు పచ్చచీరను చుట్ట బెట్టి నిండుముత్తైదువగా అలంకరించి కళ్యాణ శోభను కూరుస్తాయి... పత్రహరితం పెళ్ళిపెద్దై విందుభోజనం తయారీలో హడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తుంది.... వేళ్ళు జలాన్ని తేగా భానుడు ఆత్మీయంగా హత్తుకోగా గాలి బొగ్గు పులుసు రుచి చూపించగా పిండివంటల ఘుమఘుమలతో ఆనందాల లోగిలి అవుతుంది.... గుండెనిండా దయామృతాన్ని నింపుకుని వాయువును శుద్ది చేసి అందరికీ ఆకలి తీర్చే అన్నపూర్ణ గా చల్లని ఆప్యాయతలనుపంచే కల్పవల్లిగా పచ్చ తోరణమై శుభం పలుకుతుంది

అంశం:పత్రహరితం - మిట్టపల్లి పరశురాములు

అంశం:పత్రహరితం  -   మిట్టపల్లి పరశురాములు కవితసంఖ్య:257 శీర్షిక:ప్రాణవాయువు దివి:20-06-2019      *** వానజల్లు వరదలైనపుడు ! వనమంతాపులకరించి !! నిండుగాపండువెన్నెలై! పుడమిపురుడుపోసుకొని!! పచ్ఛనితివాసిగామారును!!! పచ్చని చెట్లు ప్రగతికిమెట్లు! జీవితానికవివెచ్చనిదుప్పట్లు మానవ మనుగడ శాంతిసౌభాగ్యాలచే!! వర్దిల్లాలంటే వసుధపైన! స్వచ్చమైన వాయువు!! కోకొల్లలు కొమ్మరెమ్మకు! ఫరిమళాలుకురిపించాలి!! పుష్కలంగా వర్షాలు!       పుడమిపైకు‌రువాలంటే!! చక్కగా చిక్కగా పచ్చని! మొక్కలనుఊరూరా!! వాడవాడలందునవరుసగా!  ఇంటికొక్క మొక్కను ఇష్టంగాపెంచినా!!! వాయు ధ్వని కాలుష్యాలన్ని పటాపంచలమై....  ప్రకృతిపరవశమై!! ప్రశాంతంగానుండును!!! అందుకే మనసున్న మనుషులారా!! చెట్లనునరికిహరితపత్రాల హరించివేయకండి!!! వాటినిమనముప్రేమగా !! మనపసిపిల్లలుగాపోసించి! సంరక్షణజేసి పెంచినా!! ప్రాణవాయువు నిచ్చి!! ప్రాణపదంగామనలను చూసుకొని.... ఆయురారోగ్యాలనిచ్ఛి!! ఆనందమయమైన! బ్రతుకునిచ్చును!!

అంశం పచ్చదనం - కమ్మరి శ్రీనివాసాచారి

 క్రమ సంఖ్య146 అంశం పచ్చదనం  -  కమ్మరి శ్రీనివాసాచారి శీర్షిక:ప్రాకులాట భూమాతను తనువంత గాయాలతో ఎద ఎదను బాదించి నీటి జాడలకై వెతుకులాట మట్టిలో కలిసిపోని, నీటిలో కరగనట్టి ప్లాస్టిక్ భూతాన్ని దేశానికి పరిచయం చేసి స్వచ్ఛభారత్ పై తొక్కు లాట విలాసాల కోసం పచ్చని అడవి తల్లిని  ఎడారిగా చేసి  పరిశుభ్రతకై పాకులాట విపరీతమైన ధోరణుల మద్య వింత పోకడలతో హోరెత్తించే ధ్వని కాలుష్యంతో చిందులేసి ప్రకృతిని సర్వ నాశనం చేసే యువతీ యువకుల్లారా మీ దారేటు? పచ్చని చెట్లను  తెగనరుకుతు రక్తాన్ని చిందిస్తూ అడవిని ఎడారిగా మారుస్తు అరణ్య రోదనలు ఎవరి కోసం? పచ్చని చెట్లను పెంచి మలయ సమీరాలు ఇచ్చే ప్రకృతిని చల్లబరిచే ప్రశాంత జీవనకై నిత్య తోరణాలతో స్వాగతం పలుకుతున్నాం నీటి బొట్టును కాపాడుతూ, భూగర్భ జలాలను  రక్షిస్తూ నీటి చుక్కను అందించే చెరువులను   నేటి నుంచె భావితరాలకు నిలువుత్తు పచ్చదనాన్ని అందిద్దాం

పత్రహరితం - గొర్రె రాజేందర్

చరవాణి : 9491487882 అంశం : పత్రహరితం కవిత  సంఖ్య : (77) కవితా శీర్షిక: పచ్చ ధనము ☘☘☘☘☘☘☘☘☘ పచ్చదనం సృష్టికి మూలాధారం జీవకోటి జీవన భృతికి ఆధారం మానవాళి మనుగడకు  విడదీయరాని ఆత్మీయత అనురాగం ప్రాణవాయువు పుట్టుకకు ఆలవాలం పచ్చని ప్రకృతికి ఆచంద్రతారార్కము భూమికి అండగా గాలికి అండదండగా పంచ భూతాల పరిరక్షణకు ప్రాణం పోయును పచ్చని చెట్టు సత్తువ కోల్పోయిన వృక్ష తనువుకు జీవం పోసి జీవితాన్ని ప్రసాదించే ప్రాణ ప్రదాత పత్రహరితం తరువు తనువుకే కాక ప్రకృతి మాత మెడలో వెలిగే పచ్చల హారపు శోభ పచ్చదనము పసిడి పంటలతో పల్లె తల్లి తనువును పరవశింప జేయు పసిడి కాంత పచ్చ నోటు కొరకు ప్రాకులాడి ప్రకృతి నంత పాడు చేస్తే ప్రళయ కాలము వచ్చి ప్రపంచమే పతనం మానవాళి మనుగడకే పెను ముప్పు పచ్చదనము లేక ప్రగతి శూన్యం పచ్చదనము లేని ప్రపంచమే నరకం పచ్చని చెట్టును నాటుదాం ప్రపంచ పతనానికి అడ్డుకట్ట వేద్దాం 🌳గొర్రె రాజేందర్🌳           సిద్ధిపేట

పత్ర హరితం - వెగ్గలం ఉషఃశ్రీ

అంశం : పత్ర హరితం  -  వెగ్గలం ఉషఃశ్రీ శీర్షిక ~🌷 పెద్దల కర్తవ్యం🌷 పత్రహరితమే ఆకుల పచ్చదనానికి మూలం! పుడమి నిండిన పచ్చదనమే మనసుకు ఆహ్లాదభరితం! పచ్చదనము నింపుకున్న ఆహారమే పోషకాల మయం... అదే మనకు ఆరోగ్యకరం! నైతిక విలువలే మనిషి మనుగడకు ఆధారం! ప్రేమాప్యాయతలు పంచుకున్న మనో వికాసము గలుగు! ఆరోగ్యకరమగు పౌరులే దేశ భవితకు పునాదులు... పత్రాలలో పత్రహరితం నిండడం ప్రకృతి సహజం... చిన్నారుల మదులలో విలువలు నింపుట పెద్దల కర్తవ్యం!

పత్రహరితం - మాధవీసనారా

అంశం:పత్రహరితం  -   మాధవీసనారా శీర్షిక:పెరగాలి కోట్లు కవిత సంఖ్య:164 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^ చెట్టులో నాకొక తపస్సు చేసుకునే మునే కనిపిస్తాడు ఒక సజీవ వంశమే గోచరిస్తుంది ప్రతి చెట్టూ ఒక పెద్ద కుటుంబం అది ఆకులహరితంతో కళ్ళకి ఆహ్లాదాన్ని అందిస్తుంది చెట్టున్న చోటు ఆనందాలకు నెలవు చెట్టుపిల్లలున్న అడవి సరే పల్లె అయినా పట్టణమైనా నగరమైనా ఎంత అదృష్టం చేసుకునుండాలి చెట్టుపిల్లలు లేని ఎడారి దురదృష్టవంతురాలే పచ్చదనం ఊపిరిపీల్చే చెట్టుకు ఆకులే స్వర్ణ సర్వాభరణాలు వాటికి పచ్చదనమే మెరుగు చెట్టుకు భూమే తల్లి సూర్యుడే తండ్రి ఆహారం సమకూర్చే తల్లిదండ్రుల రక్షణలో ఉండే చెట్లు తమకు చేటు చేసినవారిని సైతం చాటుగానైనా దూషించని చెట్లు పెరగాలి కోట్లు కోట్లు మాధవీసనారా, అనకాపల్లి విశాఖపట్టణం జిల్లా

పత్రహరితం - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

హైదరాబాద్ కవితసంఖ్య..249 అంశం...పత్రహరితం  -   డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి శీర్షిక..పచ్చదనం ---------------------------- పుడమి తల్లి పురుడుపోసుకుని తనలో దాగిన ప్రతి బీజం నీటిచుక్క తాకగానే తలలెత్తి చూస్తాయి!! రోజురోజుకు ఇంతింతగా ఎదుగుతూ సూర్యునితో సహవాసం చేసి కిరణజన్య సంయోగం ద్వారా పచ్చదనాన్ని ఒంటినిండా నింపుకుని ఆకర్షణీయంగా రూపు దిద్దుకుంటుంది!! లేలేత ఆకులతో మొక్కగా ఉండి పెద్దదై ఆకాశాన్ని అందుకోవాలన్నంత ఎత్తు ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించి వృక్షమై  వంటి నిండా పచ్చదనం నింపుకుని అలరారుతోంది!! ఎంత వేడినైనా తనలోనే దాచుకుని సకల ప్రాణికోటికి చల్లనైన గాలినిస్తూ ఆక్సిజన్ ను అందిస్తుంది!! పరోపకారమే దాని ఊపిరి కూడు గూడు నీడను ఇస్తే అవసరానికి వాడుకుంటూ ఎంత హింసించినా  తరగని వుపకార నిధి  వులుకని పలుకని మౌని!! రంగురంగుల పూలను ఒంటినిండా నింపుకుని అలరారుతుంటే  భ్రమరాలు వచ్చి చుట్టుముట్టు చేరి మకరందాన్ని గ్రోలి ఊపిరాడకుండా చేసినా చెక్కుచెదరక సువాసనలు పంచుతూనే ఉంటాయి!! కాయల భారంతో వంగి జన్మనిచ్చిన పుడమి తల్లికి  దణ్డంబెట్టి కృతజ్ఞ...

పత్రహరితం - ఏడెల్లి రాములు

నేటి కవిత క్రమ సంఖ్య*239 అంశం* పత్రహరితం  -   ఏడెల్లి రాములు శీర్షిక* పచ్చని పతాకం పత్రాలన్నీ చత్రఛాయలే వృక్ష జాతి విస్తరణలో నీరు తా వేరై  గాలి శుద్ది లో ఆకే యంత్రం ఎన్నొన్నో చిత్ర చిత్రకళ లేసుకున్న ఆకుల అర్ణవాలను వర్ణించతరమా టేకుటాకు కెంత షోకో విత్తన మండెకు పానుపయేవేళ తక్కలాకుకు వావిలాకుకు  ఎంత వయ్యారమో బాలింతల  వంతుల తానానికి తంపుల్లోకొచ్చేవేళ లక్షల్లో వృక్షజాలం ఇలకు జీవామృతం తా కాయై పండై నిండు విత్తనమై నిజ భోజన విస్తరాకై తాంబూలమై సకల జీవుల మనుగడ పురోగతిలో అగ్రతాంబూలం గరికాకు నుండి మర్రాకుదాకా మరువం నుండి తమలపాకు వరకు లోకోపయోగమే పరోపకారమే తనువంతా పసిడి పచ్చని కోకై నీడనిచ్చే అమ్మ లోగిలి చెట్టుధనం నీటికి ఏటికీ ప్రకృతి ఆకృతి లో  అధ్బుతానంద చిదానంద రూపం రాలిన ఆకైనా రాలెపూవు చందమే పండుటాకులన్నీ చందన శోభితమే హరితమై నరనారాయణులు మెచ్చినది సుశోభితమై శుభ్రజ్యోత్స్నల పల్లవించునది కాపాడుకుంటే లోకమంతా పచ్చని కాపురం ఎండు పుల్లలకెగబడితే మండే అగ్ని గుండం ఈ భూవలయం ఏడెల్లి రాములు ది* 20*06*2019(16*55) ఎల్కలపెల్లి

పత్ర హరితం - పగిడిపల్లి సురేందరు పూసల

అంశం:పత్ర హరితం  -   పగిడిపల్లి సురేందరు పూసల శీర్షిక :హరిత వర్ణం కవిత స0ఖ్య :127 20-6-19 ------------------------------------- నేటి విత్తులే రేపటి మొక్కలై లోకమంతా విస్తారించాలనుకుంటుంది పత్ర హరితమై పచ్చగా మారి నిండు ముత్తదువుల ఉంటుంది సూర్యుని కిరణాలు సోకి కిరణజన్య సంయోగ క్రియ చెంది కొమ్మలను దేశమ్మీద బాహువులు చాచిన వృక్షముగా ఎదుగుతుంది! పచ్చని వసంతంలా.. నిత్య శోభితమై నిలిచి చిగురాకులా వివిధ ఆకృతులు చెంది ఎందరికో నీడలా.. ఎందరికో ఆవాసములా.. వీచే గాలుల్నీ కురిసే వానల్నీ కాల్చే సూర్యున్నీ లెక్క చెయ్యక నిరంతర చెట్టుకు చెలిమిగా నిబ్బరంగా నిలిచిపోతుంది చల్లదనాన్నిచ్చే చనువై ఆయువునిచ్చే ప్రాణవాయువుగా నిశ్శబ్దంగా నేల రాలుతుంది! పచ్చని పత్రాలతో ప్రేమను పంచుతుంది మొక్కలను నాటుదాం  మనుషులుగా మిగులుదాం! మొక్కవొని ధైర్యంతో మొక్కలు నిలబడితేనే జీవకోటికి ప్రాణవాయువు అందించేది తరువులు పచ్చదనంతో పరుచుకుంటేనే ధరణి దేహం సౌభాగ్యంతో విరసిల్లేది!

పత్రహరితం -యమ్ వెంకటలక్ష్మి

నేటి కవిత తేదీ : 20-06-19 పేరు :  కవిత సంఖ్య : 128 అంశం : పత్రహరితం -యమ్ వెంకటలక్ష్మి శీర్షిక : సహజసిద్ధ ప్రతిభ ఆకు ఆకులో పత్రహరితం మనిషిమనిషిలో పనితనం సహజసిద్ధప్రతిభకు  నిదర్శనం ; తల్లిమొక్క చక్కని సాయం సూర్యుని వెలుతురూ మేఘుని జలధారా- పచ్చదనం వెచ్చదనం చెమ్మదనం సమ్మిళిత పోషకాహారం పూలూ పండ్ల హారం! పిల్లల స్వీయప్రతిభకు తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల సుజ్ఞానం కలగలిసి పిల్లల కలలు సాకారం, సమాజ ప్రగతికి శ్రీకారం.

పత్రహరితం -అనూశ్రీ GDK

పేరు~~ కవితసంఖ్య~187 అంశం~పత్రహరితం -అనూశ్రీ శీర్షిక~~హరితవనం ☘🍃☘🍃☘🍃☘ తొలకరి చినుకు రాలిందంటే చాలు పచ్చని వనమై పుడమి పులకిస్తుంది... హరితవర్ణపు చీరని సింగారించుకుని గరికపూవుసైతం ముచ్చటగా కళలొలుకుతుంది..... ప్రకృతిలో పచ్చదనం పత్రహరితాన్ని నింపుకున్న పత్రాలు ప్రత్యేక అందం.... భానుని కిరణాల ఒడిసిపట్టుకుంటూ పుడమికి నిరంతర జీవాన్ని అద్దుతూ జీవనాన నిలుపుతోంది పచ్చదనం... పచ్చగా అల్లుకున్న పూలతీగ ముంగిట పూజలందుకునే తులసీ మాత శుభప్రదంగా ఇంటిల్లిపాదినీ కాపాడుతుంది... సృష్టిలోని పచ్చదనమే మానవాళికి ఊపిరై మనుగడలో అడుగడుగునా తోడై నడిపిస్తోంది..... అన్నపూర్ణ సకలజీవుల అవసరాలను తీర్చె హరితవనాలను కాపాడుకోవడం మన ఉనికిని నిలుపుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత......!        అనూశ్రీ

పత్రహరితం -బస్వ రాజ్ కుమార్

అంశం:పత్రహరితం -బస్వ రాజ్ కుమార్ కవి: శీర్షిక:పచ్చదనం సంఖ్య:162 పచ్చదనం మానవుని అవసరాలకు పదే పదే పచ్చడవుతూనే ఉంది మనిషి పచ్చదనం కోసం కాకుండా పచ్చ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు మొక్కుబడిగా మొక్కను నాటి చేతులు దులుపుకుంటే సరిపోదు దాని కాళ్ళమీద అది నిలబడే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి నరికే చెట్టు నరకం చూపిస్తే సాకే చెట్టు స్వర్గం చూపిస్తుంది ప్రతినబూని ప్రతిఒక్కరు ప్రతి చోటా మొక్కలు నాటాలి ప్రకృతిని పరిరక్షించి పచ్చదనానికై పాటుపడాలి ప్రకృతిమాత పరవశించి విశ్వశాంతిని కాంక్షించాలి. బస్వ రాజ్ కుమార్ 🖊🖊 సిద్ధిపేట

పత్రహరితం - నగునూరి రాజన్న

నగునూరి రాజన్న  అంశం - పత్రహరితం తేదీ- 20-06-2019 శీర్షిక - నందన వనం సంఖ్య- 216 తొలకరి చినుకు చిలికితేనే పచ్చ తివాచీ పరుచుకుంటుంది తొలిపొద్దు కిరణాలు విచ్చుకుంటేనే పత్ర హరితం ఫరిఢవిల్లుతుంది... హరితముతోనే కదా మానవ చరితం పచ్చదనం జీవిస్తేనే ఆరోగ్య పర్యావరణం జీవకోటి ఉనికికైనా జీవ సజీవాలకైనా చెట్టు నీరు రెండు... రెండు  కళ్ళ లాంటివి..... ధవళ వర్ణపు రవికిరణం హాలికుని స్వేదం ప్రజల ఆకలి తీర్చే పచ్చని పంటౌతుంది  పాడి పంటల పల్లె తల్లులు చల్లగుంటేనే పరిశ్రమల ప్రగతి చక్రం పరుగు పెడుతుంది ప్రాణవాయువులిచ్చే జీవ సంక్షేమ హరితాన్ని రక్త పింజరయి మనిషి స్వార్థం...  నిర్లక్ష్యం...  మింగేస్తుంటే అగ్నిగోళమై అవని నిప్పురవ్వలు విరజిమ్మదా .... అతి నీల లోహితం అతలాకుతలం చేయదా ..... పచ్చదనం పెంపొందితేనే  పర్యావరణ సంక్షేమం ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే అలవాటుగా మొక్క నాటాలి కన్న పిల్లలపై  ప్రేమలోలె మనం..  కదిలి పెంచాలి వనం...  ఎడారులను తలపించే భూమాత  కాదా ఇక నందనవనం.... నగునూరి రాజన్న కరీంనగర్ (ప్రస్తుతం: USA)

పత్ర హరితం -కోణం పర్శరాములు

అంశం : పత్ర హరితం - కోణం పర్శరాములు కవిత  సంఖ్య : (302) శీర్షిక : జీవామృతం హరితం !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ఓ..నవీన నర మానవులారా చెట్టు తల్లి అర్జిస్తుంది మిమ్మల్ని పుడమి తల్లి గర్భంలో పురుడు పోసుకొని                            పుడమి తల్లి ఎదలు చీల్చుకొని మొక్కనై జీవము పోసుకొని మానవజాతి సేవే లక్ష్యాన్ని ఎంచుకుని దేవుడు కలిపిన భంధానిగా కంటికి రెప్పోలే మిమ్మల్ని  కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తుంది పచ్చని చెట్లుంటే ప్రకృతికి అందం పచ్చని ఆకులుంటే ఇల్లంతా పండుగే వివాహ బంధం బలంగా ఉంటే పచ్చని సంసారమే కాపురం సక్కగుంటే పండంటి కాపురమే ప్రతి చెట్టుకు కావాలి పత్రహరితం సూర్యరశ్మి తాకకుంటే రోగగ్రస్తే ఆ మొక్కే గాలి నీరు అందుకుంటే గాడి తప్పు మొక్క బ్రతుకు పుడమి సారము పీల్చుకుంటే మొక్క ఎదుగును ఎవరెస్టు అంతా కిరణజన్య సంయోగక్రియ ఉంటెనే పత్రహరితం పచ్చ గుండు మనిషికైనా పశువుకైన కడుపులో పడింది కరిగితేనే ఎదుగుదల లేకుంటే కడుపు మండి రోగ మొచ్చి అసిడిటీకి లోనౌను. తిన్న తిండి అరిగితేనే కడుపుకెం...

పత్ర హరితం -రాయవరపు సరస్వతి

కవిత సంఖ్య: 204 అంశం: పత్ర హరితం - రాయవరపు సరస్వతి శీర్షిక: పచ్చని హారం ******** "చెట్లను నాటితే  క్షేమం, నరికితే క్షామం, నీ రక్షణ కవచాన్ని నిన్ను నువ్వే భక్షించుకుంటున్నావు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇంటిముందు తులసి మొక్క ఇంటివెనుక వేప, జామి, అరటి,కొబ్బరి, చెట్లను నాటి పెరటిని ఆహ్లాదకరంగా,  పత్ర హరితంగా తీర్చిదిద్దు, రకరకాల పోషకాలతో  ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకో, ఆరోగ్యమేకదా మహా భాగ్యం, ప్రకృతికి అందం పచ్చని చెట్లే, నీ శ్వాస వదిలే వరకూ స్వచ్ఛమైన గాలి పీల్చుకో, ఈ పుడమి తల్లికి  వేయు పచ్చని హారం," ********* రాయవరపు సరస్వతి చోడవరం,విశాఖ జిల్లా

పత్ర హరితం -శైలజ మంగళంపల్లి

అంశం: పత్ర హరితం - శైలజ మంగళంపల్లి కవితా సంఖ్య: 75 శీర్షిక: సమాజం ఆ పత్రం తాను పచ్చగా  కళ కళ లాడుతూ నలుగురికీ నీడనవ్వాలని బ్రతుకును పంచాలని తన అమాయకపు ఎదలో ఎన్ని కలలు కంటుందో కొమ్మ కొమ్మనూ రెమ్మ రెమ్మనూ పెనవేసి ఎన్ని బంధాలను అల్లుకుంటుందో ఉషోదయపు వేకువలో తాను నిత్య చైతన్యమై కట్టుబాట్ల కలిమిలో ఎన్ని స్వేచ్చా కుసుమాలను పంచుతుందో అందుకే ఆ పత్రం తాను పచ్చటి వసంతంలా చివురించాలని ఆశపడుతూనే ఉంటుంది కానీ చెంత చేరిన చీడపురుగుల వేటులో పొద్దు వాలిన కిరణాల కాటులో బంధాలు మోడులై కలలు రాలి పచ్చదనం ఎండి నిశ్శబ్దంగా  నేలరాలి పోతుంది పచ్చదనం పంచే సమాజమైనా పచ్చదనం ఎండిన పత్రమైనా

పత్ర హరితం -బి.సుధాకర్

పేరు. సంఖ్య..294(20-6-2019) అంశం..పత్ర హరితం - బి.సుధాకర్ శీర్షిక..ఆకు పచ్చ  అందరు మెచ్చ పుడమి తల్లి గర్భాన పురుడుపోసుకొని పత్రహరితంతో ప్రాణం నింపుకొని లేతపచ్చని చేతులతో ప్రణమిల్లుతు పైకివచ్చి ప్రాణవాయువునివ్వ పదిలంగా పెరిగింది బోసినవ్వులు చిందించే పసిపాపలా ముసి ముసి నవ్వులతో ముందుకు వచ్చే మొక్క నేలతల్లికి పచ్చని ఆకులతో అల్లిన చీరతో ప్రకృతి ఇంట పండగ చేయ సందడి పెంచే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అందరు వేసే ఒట్టు పచ్చగ పెరిగే చెట్టు నరికేవారిని కనిపెట్టు మారకపోతే పనిపట్టు కరువు రక్కసీ రావద్దంటే పచ్చని చెట్టు నిలబెట్టు నల్లని మేఘం రావాలంటే చెట్లను పెంచి చూపెట్టు కదిలే గాలి చల్లదనానికి నడుంభిగించ తలపెట్టు పర్యావరణం పచ్చగ ఉంటే రోగాలెప్పడు దరిరావు పచ్చని చెట్లు ప్రాణంగుంటే ప్రజాజీవితం శాంతిని పొందు భానుడి తాపం పెరగొద్దంటే మనిషిలో మార్పురావాలీ పచ్చని చెట్లు ఉండాలంటే ప్రజల ఆశలో చెట్టుండాలి

పత్రహరితం -మమత ఐల

కవిత సంఖ్య:—70 అంశం:—పత్రహరితం - మమత ఐల శీర్షిక:— మొక్కలు 🌱🌱🌱🌱🌱🌱🌱🌱 మొక్కలు ఆకుపచ్చగా కనిపించటానికి కారణం పత్రహరితం ఆకుల్లో పిండిపదార్థం తయారయ్యే కిరణజన్య సంయోగ క్రియకు కాంతి చర్యలు  నిష్కాంతిచర్యలు హరితరేణువుల్లోనే జరగడానికి పత్రహరితం దోహదకారినైనా ఈ కాంతి నిష్కాంతి చర్యల్లో  పత్రహరితమున్నా కాంతి చర్యలకు మాత్రమే పత్రహరితమవసరం కాని కాంతిచర్యలు జరిగితేనే  నిష్కాంతి చర్యలు జరుతాయి ఆకుల్లో స్తంబకణాలు స్పంజికణాలు వాటిల్లో హరితరేణువులుండి ఈ..హరితరేణువుల్లో పత్రహరితముంటుంది మనకు మల్లే మొక్కకూడా జీవి ఈ..జీవికి  పై బాహ్య చర్మం కింది బాహ్య చర్మం వుండి ఈ..రెంటి మధ్య నీలిరంగు కణాలతో నీటిని సేకరిస్తాయి వీటికి రక్షకకణాలుంటాయి ఆకు ఆకుపచ్చరంగులో  కనబడడానికి కారణం ఆకుల్లో ఎక్కువ పత్రహరితముండంవల్లే 🌳చెట్లు కూడా జీవులే కనుక జీవహింస మహాపాపం చెట్లను కాపాడదాం!! పర్యావరణను పరిరక్షిద్దాం!! ---మమత ఐల       హైదరాబాద్ ---

పత్రహరితం-ఉదయశ్రీ ప్రభాకర్

పేరు. ఉదయశ్రీ ప్రభాకర్ కవిత సంఖ్య.247 అంశం. పత్రహరితం హరితం హరితం.. హరితం..మనసును ఉల్లాసం పరిచే వర్ణం ప్రకృతికి శోభయమానం ఈ సుందర వర్ణం శుభాలకు సూచిక ఈ వర్ణం అంగీకారాలు చిరునామ ఈ వర్ణం..హరితం కనులకు చల్లదనాలను పంచుతూ పుడమిని సుందరంగా తీర్చిదిద్ది సస్యశ్యామలం చూపి దేశ కాలపరిస్థితులను చెప్పకనే చెప్పే చెలిమి నేస్తం హరితం పుడమి తల్లి దాహం పూర్తిగా తీరితే.. కొండల వెనుక దాగిన సూర్యుడు చూపులతో మనసారా తడిమితే.. తరువులు చిగురుస్తాయి..పత్రాలు హరితాలతో మెరుస్తాయి.. పంట చేలలో పచ్చదనాలు నాట్యమాడితే.. రైతన్న కళ్ళల్లో ఆనందo చిందేస్తుంది జగతికి ఆకలి బాధలు తీరుతాయని.. కుటుంబ భారం తగ్గుతుందని చిరుగాలి తరంగాలతో పత్రహరితాలు సందేశం పంపుతాయేమో మేఘుడికి చిఱుజల్లై కవ్విస్తాడు హొయలు పోతున్న ప్రకృతి కన్యను.. హరితాలు లేని జగతి ఎడారిలా తలపిస్తూ ఆకలి దప్పులు వెంటాడుతూ చల్లని సమీరాలు కరువై శ్వాస వేడెక్కుతుంది ఊపిరి అందక ఊహల్లో సైతం భయానక దృశ్యమై భయాలేవి నిజాలై నిల్వక ముందే ప్రకృతిని నింపుదాం హరిత వనాలతో పుడమికి పచ్చ చీరకట్టినట్లు.. ఉదయశ్రీ ప్రభాకర్.. 20.06.19

పత్ర హరితం చక్రపాణి,అనకాపల్లి, విశాఖజిల్లా

నేటికవితాంశం: పత్రహరితం రచన:డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి కవిత సంఖ్య: 193 కవిత శీర్షిక:        ప్రేమ హరితం జీవం పోసుకోగానే సరికాదు సరైన పోషకాలూ అందాలి అప్పుడే నిగనిగలు మిసమిసలు మొక్కకైనా మనిషికైనా. నేలనుంచి తల్లివేరు పీల్చుకున్న నీరు  కొమ్మరెమ్మల ఈనెల్లో ప్రవహించి వాటి ఎదుగుదలకి మెట్లౌతాయి ఇంకాచెప్పాలంటే ఆయువుపట్లౌతాయి. నింగినుంచి పొందిన సూర్యరశ్మి ఉత్తేజమే కళాకాంతులౌతాయి గాలికి తలలూచి చేవపెంచుకొని భవిష్యత్ లో వృక్షరాజాలౌతాయి ఋతువులను బట్టి ఆకులురాల్చినా మరలా పచ్చదనం చిగురించి హరితవనాలై వికసిస్తాయి చల్లని నీడలనిచ్చి సేదతీరుస్తాయి చెట్టును అతుకున్న ఆకుచూస్తే బిడ్డనుహత్తుకున్నఅమ్మే గుర్తొస్తుంది  ఆకులుంటేనే చెట్టు హరితం అమ్మ ఉంటేనే ప్రేమభరితం చక్రపాణి,అనకాపల్లి, విశాఖజిల్లా

పత్ర హరితం - జయంతి సుధాకర్

నేటి కవిత *** జయంతి సుధాకర్. సంఖ్య....53. అంశం.... పత్ర హరితం శీర్షిక....సతతం ******** ప్రకృతి....పత్రహరితంతో, పట్టు చీర కట్టుకున్న ఇంతి పచ్చ పచ్చని వృక్షం, నిస్వార్తమే..ధ్యేయంగా మొక్కవోని ధైర్యంతో, నింగికి  ఎదుగుతుంది భానుని తో చెలిమి చేసి పుడమికి లాభాల పగడాలద్దే మేలు లేన్నో.... సమకూర్చు కల్పతరువు మానవులు పీల్చే ఆమ్లజని నిండు కాలాలు.... సెలవంటూ లేని నెలవు! గిరులు పగిలే గీష్మతాపాన్ని నిబిడీకృతం చేసుకొని... చల్లని వింజామరలు మనకిచ్చే త్యాగమయి..పత్రహరితమయి పత్రాల్లో....హరితాన్ని నింపుకొని... సృష్టిలో అందమైన తోరణమై మానవుని మనుగడలో పోషణ నుండి శేషుం వరకు తోడుండే నేస్తం నువ్వైతే... గొడ్డల్లతో మొదళ్ళు నరికే మెదల్లు లేని మానవులు సృష్టిస్తూ...అరణ్యాలు, పత్ర హరితాన్ని.... పాతరేస్తున్న....వైనం! ఇంటి ఇంటికో మొక్క, పెంచేస్తే..కాలుష్యం ఓ లెక్కా ప్రాణమున్న మనిషి!!!!! పత్ర హరితాన్ని కాపాడి పదిల పరచు జీవితాన్ని!!! .............జయంతి సుధాకర్🍁 జగిత్యాల