పత్రహరితం -యమ్ వెంకటలక్ష్మి

నేటి కవిత
తేదీ : 20-06-19
పేరు : 
కవిత సంఖ్య : 128
అంశం : పత్రహరితం -యమ్ వెంకటలక్ష్మి
శీర్షిక : సహజసిద్ధ ప్రతిభ

ఆకు ఆకులో పత్రహరితం
మనిషిమనిషిలో పనితనం
సహజసిద్ధప్రతిభకు  నిదర్శనం ;
తల్లిమొక్క చక్కని సాయం
సూర్యుని వెలుతురూ
మేఘుని జలధారా-
పచ్చదనం వెచ్చదనం
చెమ్మదనం
సమ్మిళిత పోషకాహారం
పూలూ పండ్ల హారం!
పిల్లల స్వీయప్రతిభకు
తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల సుజ్ఞానం
కలగలిసి పిల్లల కలలు
సాకారం, సమాజ ప్రగతికి
శ్రీకారం.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి