కనుపాపలు - పత్తిపాటి రూపలత
నేటి కవిత ********* పేరు -- పత్తిపాటి రూపలత అంశం -- కనుపాపలు శీర్షిక -- ప్రియసఖి సంఖ్య -- 119 ************ నా కనుపాపల్లో కొలువైన నీ రూపం సదా నిర్మలం నా మనసులో నెలవైన దైవం నాకు ఆశాదీపం నా కష్టంలో తోడైన ఆ దివ్య తేజం తలచినంతనే ఒసగు భాగ్యం కొండలలో కొలువైన ఆ కొండంత రూపం కోరినవారి కొంగుబంగారం నిత్య కళ్యాణం పచ్చతోరణం పాదాలు చూస్తేనే పాపాలు హరణం కళ్ళల్లో ప్రసరించు తేజోకిరణం భక్తులను కాపాడు భవతారణం అనన్య సామాన్యం ఆనందనిలయం అడుగిడగానే అంతా గోవిందమయం మన కళ్ళు చేశాయి పూర్వజన్మలో పుణ్యం కనుపాపల్లో నిలుచును నిండైన రూపం ఆచంద్రతారార్కం ************** 🖋అద్వైత 🖋