గరికపూలు - కనకం శ్రీనివాస్
కనకం శ్రీనివాస్
సంఖ్య:131
అంశం:గరికపూలు
శీర్షిక : అది నేనే కదా !
తరిమేయలేదా..!?
చిన్నోడికి పెయిమీద
దద్దుర్లు లేసినయని
ఆడ ఈడ తిరిగి
గొల్లెంతో తూడ్సినా తగ్గకుంటే
పెంట మీదనో
పెరటి చేళ్లోనో పెరిగి నన్ను
పర్లెదని చేతివైద్యున్ని సంప్రదించినపుడు ఎదో తైలంతో
నా గరకపూలతో మంత్రించి
గడియకు ఓసారి గోముగా తూడిచి
సొన్నారిని తరిమెయలేదా
గరకపోచని చిన్నగా చూస్తే ఎలా?
గొబ్బెమ్మకు పూల పరిమళం నేనేగా
నా చిట్టిచెల్లెలు సంక్రాంతి నాడు
చక్కని ముగ్గులేసి సంబరపడి
సిగ్గుతో మురిసి మొగ్గైనపుడు
ఆ చిన్నారిలో పుస్పించిన సిగ్గు
నా వల్ల వచ్చిందని ఎరుగరా
సంక్రాంతి పండుగనాడు
పల్లెపల్లెంత నేను గొబ్బెమ్మలో
ఉన్నాననే కదా తడిసి మురిసింది
ఆ మురిపెపం పల్లెకు నేనిచ్చిందే కదా...
సంఖ్య:131
అంశం:గరికపూలు
శీర్షిక : అది నేనే కదా !
తరిమేయలేదా..!?
చిన్నోడికి పెయిమీద
దద్దుర్లు లేసినయని
ఆడ ఈడ తిరిగి
గొల్లెంతో తూడ్సినా తగ్గకుంటే
పెంట మీదనో
పెరటి చేళ్లోనో పెరిగి నన్ను
పర్లెదని చేతివైద్యున్ని సంప్రదించినపుడు ఎదో తైలంతో
నా గరకపూలతో మంత్రించి
గడియకు ఓసారి గోముగా తూడిచి
సొన్నారిని తరిమెయలేదా
గరకపోచని చిన్నగా చూస్తే ఎలా?
గొబ్బెమ్మకు పూల పరిమళం నేనేగా
నా చిట్టిచెల్లెలు సంక్రాంతి నాడు
చక్కని ముగ్గులేసి సంబరపడి
సిగ్గుతో మురిసి మొగ్గైనపుడు
ఆ చిన్నారిలో పుస్పించిన సిగ్గు
నా వల్ల వచ్చిందని ఎరుగరా
సంక్రాంతి పండుగనాడు
పల్లెపల్లెంత నేను గొబ్బెమ్మలో
ఉన్నాననే కదా తడిసి మురిసింది
ఆ మురిపెపం పల్లెకు నేనిచ్చిందే కదా...
Comments
Post a Comment