కోకిలమ్మ - శ్రీదాస్యం లక్ష్మయ్య
శ్రీదాస్యం లక్ష్మయ్య💐 కవిత సంఖ్య: 241 అంశం: కోకిలమ్మ - శ్రీదాస్యం లక్ష్మయ్య శీర్షిక: కూజితారావాల కొమ్మా *********** కిలకిలారావాల కోకిలమ్మ నీ పాట వసంతుని రాకను వచియించు నీనోట మేనిఛాయనలుపైనా నీగొంతున మెరుపు ప్రకృతి కాంత పరవశించు పసందైన నీపిలుపుకు కొంగొత్త చివురుల గాంచిన మది పులకింత కుహుకుహూ గానాలను పలికించదె నీనోట ఆమనిరాకను ముందే పసిగట్టే జ్ఞానధనం వరముగ పొందిన నీ బ్రతుకే ధన్యము చిరుకొమ్మన తులతూగుతు నినదించే నీస్వరం చిగురాశల వసంతాల మేలుకొలుపు నీగానం పలుకులోని మాధుర్యం చిలికించే సౌశీల్యం పరవశాన శిరసులూగి నవపల్లవాల పల్లవించు కవుల కలాల కలవరింత నీవు గానగంధర్వుల గానలహరి.. నీవు తేనెలూరుచుండు తేటపలుకునీవు కోకిలమ్మా... కూజితారావాల కొమ్మా