కోకిలమ్మ - సుభాషిణి వెగ్గలం


కవిత సంఖ్య :77
అంశం :కోకిలమ్మ  -  సుభాషిణి వెగ్గలం
శీర్షిక :ప్రకృతికి-కానుక

రాలుతున్న పండుటాకులు
ఆమనికి స్వాగతం పలుకుతూ
లేలేత చిగుళ్లతో
వసంత గీతమాలపిస్తున్నాయి

మండుటెండల్లో
ఆహ్వానించి ఇచ్చిన
మావి చిగుళ్ల విందుకి
మైమరచిన కోకిలమ్మ
వీనుల విందైన అమృత గానాన్ని కానుకిస్తుంది

ప్రాణం పోసిన ఆ బ్రహ్మే
కోకిలమ్మ గాన మాధుర్యానికి
పరవశించి మైమరచి పోయాడేమో
తీపి రాగాల ఆ కోకిలమ్మకు
నల్ల రంగు పులిమాడు
రంగేదైనా వీనుల విందైన గాత్రాన్ని
ప్రకృతికి కానుకగా ఇచ్చాడు

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి