కోకిలమ్మ - యమ్ వెంకటలక్ష్మి


కవిత సంఖ్య : 128
అంశం : కోకిలమ్మ  -  యమ్ వెంకటలక్ష్మి
శీర్షిక : కవికోకిలలు

ప్రకృతికోయిల మధురస్వరం
వసంత ఋతువు తదనంతరం
మటుమాయమై
అడపాతడపా
అక్కడక్కడ
ఆషామాషీ స్వరాన
వినబడుతుంది ;
'నేటి కవిత' తోటలోని
కోయిలలు
ఏడాదిపొడవునా
కాలచక్రపు కదలికకు
స్పందిస్తూ ప్రతిస్పందిస్తూ,
భూతభవిష్యద్వర్తమానాలలో
విశ్వమంతా పరిభ్రమిస్తూ,
కవిత్వాన్ని స్మరిస్తూమేల్కొని,
కవితాలాపన చేస్తూనే
వృత్తి ధర్మాలను
నిర్వర్తిస్తూ,
కవిత్వాన్నే మాట్లాడుతూ,
కవిత్వాన్నే భోంచేస్తూ,
కవితలనే కలవరిస్తూ
పలవరిస్తూ ప్రతిక్షణాన్నీ
కవితామయం చేస్తున్న
ఈ కాలం కవికాలం-
అవును ఇది మన
నేటి కవికోకిలల కాలం!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి