పత్ర హరితం - అన్నాప్రగడ వేంకట నరసింహారావు
పేరు. అన్నాప్రగడ వేంకట నరసింహారావు
సంఖ్య..233
అంశం..పత్ర హరితం
శీర్షిక..సతతం హరిత జీవం
ప్రకృతికి పచ్చదనం కానుకగా ఇచ్చేందుకు,
భూమిని చీల్చుకొని పుట్టి మొలకగా మొదలై మహావృక్షంగా మారిన ప్రాణబిక్షం వృక్షం..
పాడువాయువును తాను పీలుస్తూ ప్రాణవాయువును బహుమతిగా మానవునికే కాదు సమస్థజీవరాసులకు ఒసంగు జీవనాడి వృక్షం..
భూమికి పచ్చతోరణంలా తన హరిత పత్రాలు వెలుగుతూ సకాల వర్షం,గాలి, వరదలతో భూసారం దెబ్బతినకుండా కాపాడు వరదాయిని వృక్షం..
వృక్షో రక్షిత రక్షతః..
వృక్షాన్ని తలిస్తే,హరిత పత్రాలను వారు గుర్తుకొస్తున్నారు..
హరిత మిత్ర బిరుదాంకితుడు
ఆ వనమాలి రామయ్య గుర్తుకొస్తున్నారు..
భార్య జానమ్మ
భర్త అడుగుజాడలలో లక్ష్యం కోసం ఎన్నడూ ముందడుగే...
కంప చెట్టు పక్కన ఒక మంచిచెట్టు, పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు వారి నినాదాలు..
అట్టముక్కలపై, పాత రేకులపై వృక్ష రక్షణకు నినాదాలు రాస్తూ..
సంరక్షణ విధానం తెలుపుతూ..
కవితలు రాస్తూ,సూక్తులు వివరిస్తూ..
వాడవాడన ప్రచారం చేస్తూ..
పిలిచిన తడువే మొక్కనాటుటకు ప్రత్యక్షమవుతూ..
షష్టిపూర్తి వత్సరాలుగా కోటికి పైగా చెట్లను నాటిన అభినవ అశోకుడు..
చెట్టుపై అతనికి వల్లమాలిన ప్రేమ..
చేతిపై పచ్చబొట్టు వృక్షోరక్షతి రక్షతః...
బిడ్డ పెళ్ళిశుభలేఖపై చెట్లపెంపక జ్ఞానం..
మనుమరాళ్ల నామములు హరిత,లావణ్య,పుష్ప,చందనలు..
ఎందరో ఇటువంటి మహానుభావులు..
అందరికి పాదాభివందనాలు...
✒అన్నాప్రగడ వేంకట నరసింహారావు....

Comments
Post a Comment