గరికపూలు - డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
నేటికవితాంశం: గరికపూలు
రచన: డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
కవిత సంఖ్య:192
కవిత శీర్షిక:
గరికపూల సొగసు
*గరిక పూల చెంతచేరి
కైమోడుపుచేతును..*
అన్న సి.నా.రె.పదాలు
బాలుగానమే మదినిండి
వాటి అనుభూతిపెంచాయి.
అది ఆధ్యాత్మికమో సామాజికమో
వ్యంగ్యమో మరోచెణుకో
ఈ పూలమాటెత్తితే
'గరిక' పాటివారి భాషణం
చప్పునగుర్తుకొస్తుంది.
తెలంగాణ సీమలో
సొగసైన గునుగుపూలుసైతం
గుర్తొచ్చితీరతాయి 'గరికపూల'నగానే.
నడిచే ప్రతిపాదాన్ని
మెత్తగాముద్దాడే 'ముద్దు'బంతి.
'గరిక'పూజార్హమేనంటూ
గజాననుడు స్వీకరించటంలేదా?
గడ్డిపువ్వయినా,గరికపోచయినా
భగవంతుని సృష్టిలో దేనివిలువదానిదే.
అలలధాటికి కొట్టుకుపోయేవాడికి
గడ్డిపోచైనా మహా ఆధారమేగా
తృప్తి చెంది అందాన్ని ఆస్వాదించగలిగితే
గరికపూవైనా మల్లెలూ సంపెంగలేఔతాయి
రచన: డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి
కవిత సంఖ్య:192
కవిత శీర్షిక:
గరికపూల సొగసు
*గరిక పూల చెంతచేరి
కైమోడుపుచేతును..*
అన్న సి.నా.రె.పదాలు
బాలుగానమే మదినిండి
వాటి అనుభూతిపెంచాయి.
అది ఆధ్యాత్మికమో సామాజికమో
వ్యంగ్యమో మరోచెణుకో
ఈ పూలమాటెత్తితే
'గరిక' పాటివారి భాషణం
చప్పునగుర్తుకొస్తుంది.
తెలంగాణ సీమలో
సొగసైన గునుగుపూలుసైతం
గుర్తొచ్చితీరతాయి 'గరికపూల'నగానే.
నడిచే ప్రతిపాదాన్ని
మెత్తగాముద్దాడే 'ముద్దు'బంతి.
'గరిక'పూజార్హమేనంటూ
గజాననుడు స్వీకరించటంలేదా?
గడ్డిపువ్వయినా,గరికపోచయినా
భగవంతుని సృష్టిలో దేనివిలువదానిదే.
అలలధాటికి కొట్టుకుపోయేవాడికి
గడ్డిపోచైనా మహా ఆధారమేగా
తృప్తి చెంది అందాన్ని ఆస్వాదించగలిగితే
గరికపూవైనా మల్లెలూ సంపెంగలేఔతాయి
Comments
Post a Comment