గరిక పూలవనం - యమ్ వెంకటలక్ష్మి
యమ్ వెంకటలక్ష్మి
కవిత సంఖ్య : 127
అంశం : గరిక పూలవనం
శీర్షిక : గరిమగన్న వనం
ఆహా! ఏమి మా భాగ్యము!
అందరునూ ఇచ్చ వచ్చినట్టు తొక్కిపడవేయు
ఈ గడ్డిపూల మైదానానికెంత
గారవమబ్బినది!
ఎంత చక్కని పేరొసగిరి!
ప్రచార మాధ్యమముల
పుణ్యమా యని
భోళాశంకరునికి మేమన్నచో కడుప్రీతియని
అందరికి తెలిసెనా యేమి
మా కోసమింత వెదకుచున్నారు?!
నేడు మహాశివరాత్రి
కాదుగదా సదాశివుడిని
గరిక పూలతో ఇంత యెత్తున అర్చించుటకు?!
ఏ నాయకుని కరుణా కటాక్షములో మాపై ప్రసరించి మమ్ములను
భారతీయ నిర్మల నిరాడంబర సంస్కృతికి
ప్రతీకలుగ నెంచి
గరిక పూలవన దినోత్సవము
ప్రకటింపలేదు కదా?!
కూరగాయల ధరలు పెరిగినవని మాతో 'రుచి'కరమగు వంటలు
పరిశోధించుచుంటిరేమో?!
గృహాంతర అలంకరణకు
మమ్ముల వాడెదరేమో?!
కానిండు, కానీ దయచేసి రసాయనములు మాత్రముపయోగించి
మా ఉత్పత్తిని పెంపొందింప యత్నింపకుడు, మా
గరిక పూలవనమును
గరిమగన్న వనముగనే
నిలుపుడీ మహాజనులారా!
కవిత సంఖ్య : 127
అంశం : గరిక పూలవనం
శీర్షిక : గరిమగన్న వనం
ఆహా! ఏమి మా భాగ్యము!
అందరునూ ఇచ్చ వచ్చినట్టు తొక్కిపడవేయు
ఈ గడ్డిపూల మైదానానికెంత
గారవమబ్బినది!
ఎంత చక్కని పేరొసగిరి!
ప్రచార మాధ్యమముల
పుణ్యమా యని
భోళాశంకరునికి మేమన్నచో కడుప్రీతియని
అందరికి తెలిసెనా యేమి
మా కోసమింత వెదకుచున్నారు?!
నేడు మహాశివరాత్రి
కాదుగదా సదాశివుడిని
గరిక పూలతో ఇంత యెత్తున అర్చించుటకు?!
ఏ నాయకుని కరుణా కటాక్షములో మాపై ప్రసరించి మమ్ములను
భారతీయ నిర్మల నిరాడంబర సంస్కృతికి
ప్రతీకలుగ నెంచి
గరిక పూలవన దినోత్సవము
ప్రకటింపలేదు కదా?!
కూరగాయల ధరలు పెరిగినవని మాతో 'రుచి'కరమగు వంటలు
పరిశోధించుచుంటిరేమో?!
గృహాంతర అలంకరణకు
మమ్ముల వాడెదరేమో?!
కానిండు, కానీ దయచేసి రసాయనములు మాత్రముపయోగించి
మా ఉత్పత్తిని పెంపొందింప యత్నింపకుడు, మా
గరిక పూలవనమును
గరిమగన్న వనముగనే
నిలుపుడీ మహాజనులారా!
Comments
Post a Comment