పత్రహరితం - పత్తిపాటి రూపలత

నేటి కవిత
*********
పేరు -- పత్తిపాటి రూపలత
అంశం -- పత్రహరితం
శీర్షిక -- నేత్ర పర్వం
సంఖ్య --115
**************
పరువాల పచ్చటి కోక చుట్టుకున్న
పచ్చందాల వనాలను చూస్తే
పుడమికి అందమైన భాగ్యం
మనిషికి నేత్రపర్వం
మొక్కకు ఆకులే అందాల రూపం
ఆకుకు పత్రహరితమే ప్రాణాధారం
పత్రహరితమే లేకుంటే మోడువారును వృక్షం
మనిషికి మంచితనం మానవత్వమే పత్రహరితం
అవిలేనివాడు జీవరహితం
మంచితనపు ఆనవాళ్లే వేర్లుగా అల్లుకున్న సమాజమే నివాసయోగ్యం
పచ్చగమెరిసే ఆకులతో
నిండిన వనమే ఆరోగ్యకరం
ఎండిన ఆకులలో పత్రహరితం శూన్యం
మంచితనం లేని మనిషి బ్రతుకే వ్యర్థం
మనిషికి,ప్రకృతికి లేదు అవినాభావం
మన చేతలే భువికి ఘోర శాపం
**************
🖋అద్వైత🖋

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి