గరికపూల వనం - సుభాషిణి వెగ్గలం

పేరు :సుభాషిణి వెగ్గలం
కవిత సంఖ్య :76
అంశం :గరికపూల వనం
శీర్షిక :ప్రకృతి ప్రసాదం

తొలకరి వెదజల్లిన
మట్టి పరిమళాలకే పురుడోసుకుని
పుడమికి పచ్చని తివాచీ పరిచాయి
అక్కడక్కడా తలలెగరేసుకున్న పూలు
పుడమికి పిల్లతెమ్మెరల వింజామరలయ్యీయి

పూజకు నోచుకోని పువ్వులైతేనేం
గణేశుడికి ప్రీతి యై
మెడ నలంకరించే మాలలయ్యాయి

గ్రహణం పట్టిన కీడుఛాయలు
ముంగిలి దాటనివ్వని సంజీవనియై
నిత్య హరతయై
హరితానికే
వన్నె తెచ్చిన గరిక వనం
ప్రకృతి ప్రసాదించిన వరం

కణుపు కణుపున
కొత్త మొక్కకు ఊపిరి పోసి
నేలంత ఆవరించి
నేల కోరివేతకు అడ్డుకట్ట వేసి
జడివానల సవాళ్లనెదుర్కొనే ఊతమై
నేల తల్లి ఋణం తీర్చుకుంటాయి

ఆదర్శ

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి