గరికపూలవనం - మద్దెల ప్రభాకర్

పేరు: మద్దెల ప్రభాకర్
అంశం : గరికపూలవనం
శీర్షిక:   "గరిక చిరునవ్వు"

********

భూమికి పచ్చని కోక పై అద్దిన
రంగురంగుల నక్షత్రాల కాంతివనం

ఎక్కడ వెదికినా కానరాదు గరికపూలవనం

ఋతువు మహిమనో లేక భానుని మాయనో 

నిండు ముత్తైదువలా కనిపించే  జననీ

కమనీయ అందాలు ఎటుబోయేనో

ఉదయాన గరికపై  హిమబిందువులు

పెదవులపై మెరిసే చిరునవ్వులు కనుమరుగాయే

పూజకు పనికి రాని పూవులని చులకన చేసినా

నేడు కమనీయ అందాలు లేక కలవరమాయే

గ్రాసము లేక మెకముల లమటించే
సీతాకోక చిలుకలు చిన్నబోయే

ఏమి లేనిచోట
గడ్డిపోచ ఔషదమాయే

గణనాథుని పూజకు గరిక ద్రవ్యమాయే

పనికి రానిదంటు ప్రకృతిలో కలదా ?
ప్రతిదాని విలువ తెలిసి మసలాలిగా..

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి