పత్ర హరితం - లక్ష్మి మదన్


లక్ష్మి మదన్
నేటి కవిత :142
అంశం : పత్ర హరితం
శీర్షిక : పచ్చదనం
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

" పత్ర హరితం " అంటే అర్థం తెలియకున్నా
పచ్చదనం కోరే వారు ఆనాడు!
ఆరోగ్యం మన చేతుల్లో అంటూ..
పచ్చ కూరలు భుజించమని
పచ్చని చెట్లు పెంచమని చెప్తూ
నిరూపించారు ఆచరించి

ఇంటి ముందు పచ్చగా పందిరి పై
పాకుతున్న మల్లె తీగ ..దానిపై తెల్లని మురిపెపు మల్లె పూలు!
వాకిట్లో ముసి ముసి గా నవ్వుతూ ముద్ద బంతులు!

ఇంటికి వెనక ఉన్నా...నేనున్నా నని
ఇల్లంతా ఘుమ ఘుమ లాడించే కరివేపాకు చెట్టు!
సొర, బీర , చిక్కుడు సందిస్తే చాలు..
ఇంటి పైకి ఎక్కి పోవడమే!

ఎక్కడ చూసినా హరితం హరితం
ఆకుల్లో పత్రహరితం!
ఏపుగా పెరిగిన తోట కూర
నాజూకైన పాల కూర..అబ్బా! పుల్లని చుక్క కూర...చిరు చేదు మెంతి కూర

కంటికి ఇంపుగా కనబడుతూ
ఒంటి నీ కాపాడే ఆరోగ్య ప్రదాయిని ఈ హరితం!
వృక్షముల నీ పెంచండి అనే నానుడి లేదు...పెంచే వారు తమ వంతుగా!
వేప చెట్టు లేని  పెరడు
పాపల బోసి నవ్వు లేని ఇల్లు లేదు ఆనాడు!

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
☘☘☘☘☘☘☘☘

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి