గరికపూలవనం - గొర్రె రాజేందర్
గొర్రె రాజేందర్
చరవాణి : 9491487882
అంశం : గరి కపూలవనం
కవిత సంఖ్య : (76)
కవితా శీర్షిక: వారకాంతను నేను
💃💃💃💃💃💃💃💃💃💃
తిమిర సరస్సులో విరిసిన కలువనై
పచ్చనోటు వెన్నెలకై నిరీక్షించే పడతిని నేను
మగాడి కామక్రీడలో పావుగా మారి
సరస రసానుభూతులను పంచే
సొగసుల పూబోడిని నేను
విధి వంచితనై వీధుల్లో చేరి
వంచన వలలో చిక్కిన వనితను నేను
విటుల కటాక్ష వీక్షణల కొరకై
వలపుల అంగట్లో వాలిన చిలుకను నేను
విరులలో మత్తైన విరజాజులను పెట్టి
వాడిన బ్రతుకైన వధూటి నేను
కన్నీటికి అడ్డుగా కాటుకను రాసి కవ్విస్తూ
నిత్యం దగ్ధమయ్యే తన్విని నేను
నయనానందకరంగా నవ్వులు రివ్వుతూ
అంగాంగాన అందాలు విరజిమ్ముతూ
అందాల విందు చేసే అతివను నేను
వలువలన్ని జార్చి వారకాంతగా మారి
వెలలేని బ్రతుకైన వెలదిని నేను
చూడడానికి ఆస్వాదించడానికే తప్ప
పూజకు పనికి రాని పువ్వును నేను…
చరవాణి : 9491487882
అంశం : గరి కపూలవనం
కవిత సంఖ్య : (76)
కవితా శీర్షిక: వారకాంతను నేను
💃💃💃💃💃💃💃💃💃💃
తిమిర సరస్సులో విరిసిన కలువనై
పచ్చనోటు వెన్నెలకై నిరీక్షించే పడతిని నేను
మగాడి కామక్రీడలో పావుగా మారి
సరస రసానుభూతులను పంచే
సొగసుల పూబోడిని నేను
విధి వంచితనై వీధుల్లో చేరి
వంచన వలలో చిక్కిన వనితను నేను
విటుల కటాక్ష వీక్షణల కొరకై
వలపుల అంగట్లో వాలిన చిలుకను నేను
విరులలో మత్తైన విరజాజులను పెట్టి
వాడిన బ్రతుకైన వధూటి నేను
కన్నీటికి అడ్డుగా కాటుకను రాసి కవ్విస్తూ
నిత్యం దగ్ధమయ్యే తన్విని నేను
నయనానందకరంగా నవ్వులు రివ్వుతూ
అంగాంగాన అందాలు విరజిమ్ముతూ
అందాల విందు చేసే అతివను నేను
వలువలన్ని జార్చి వారకాంతగా మారి
వెలలేని బ్రతుకైన వెలదిని నేను
చూడడానికి ఆస్వాదించడానికే తప్ప
పూజకు పనికి రాని పువ్వును నేను…
Comments
Post a Comment