గరికపూలు - సౌమ్య
పేరు:సౌమ్య
కవిత సంఖ్య:119
అంశం:గరికపూలు
శీర్షిక:చూడ-అందం
పనికి-వ్యర్ధం.
గరికపూలు పృథ్వి మాత ఎదపై మెరిసే పూలవనాలై సొగసులద్దుతూ,
చూసే కనులకు చూడముచ్చటై పచ్చదనపు పానుపుపై మేలిమి ముత్యాల్లా కొలువుదీరి,
ఆదిత్యుని ఆగమారంభంలో కనుల విందుగా తలుకులీనుతూ ఉన్నా,
పూజకు నిరూపయోగమే.
తరుణి జడాలంకరణకు కడుదూరమే కదా..
కనులకు ఇంపైన కార్యాలకు అక్కరకురానివే..
అందంగాలేకున్నా ఆవశ్యమైనవాటి జీవితాలకే అర్ధం .
అతను గరికపూవు చందమే..
విలాసాల వీరుడు,
ఆడంబరాలకు అగ్రగణ్యుడు,
పేకమేడల్లాంటి మాటలతో ప్రగల్భాలు పలుకుతూ కుళికేవాడే కానీ,
పనికి వంగని పరమసోమరి.
తిండికి తిమ్మరాజు,పనికి పోతురాజులా చూడడానికి బంగారం అనుకునేలా ఉన్నా, కనీస బాధ్యతెరగని బలాదూర్..
కనులకు నచ్చిండని కట్నకానుకలతో కన్యాదానం చేస్తే,
కడు సోమరై కట్టుకున్నదాని కలలసౌధాన్ని కాలదన్నాడు.
ఇపుడు వాని అసలు రూపంతో అందరి కనులు తెరుచుకున్నా పూరింపలేని లోటు జరిగిపోయింది.
అందుకే
కనులకు ఇంపైనది కలనే కావచ్చు,
కటిక నిజమూ కొన్నిసార్లు భ్రమలా తోచవచ్చు..

Comments
Post a Comment