గరికపూలవనం - విఠాలశ్రీకాంతశర్మ 19-06-2019

పేరు. విఠాలశ్రీకాంతశర్మ
అంశం. గరికపూలవనం
కవితసంఖ్య.258
శీర్షిక. దేనికదేగొప్ఫ
తేది.19-06-2019
**********

గులాబీపూలవనమైనా

గరికపూలవనమైనా
ప్రకృతిభూమాతసిగలో
అలంకరించిసుమవనాలే
వసుంధరహృదయంపులకించి
సిగలోతురుముకున్నపూదండలే
మనిషిదృష్టిలోవిలువల్లో
తేడాలున్నాప్రకృతిదృష్టిలో
అన్నీసమానమే.
మోదుగుపూలైనా మొల్లలైనా
అడవిపూలైనా గరికపూలైనా
ప్రకృతితల్లిఒడిలో ఓలలాడే
బిడ్డలేకదా....
రూపలావణ్యసౌరభసౌకుమార్యాలలోభిన్నత్వాలున్నా
తల్లీబిడ్డల అనుబంధం
నిష్కల్మషమైనదే కదా...
గరికపూలవనంవిరబూసినా
మల్లెలమొల్లలజాజులతోటలు
విరిసినామొదటపులకించేది
ప్రకృతిమాతనే.......




Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి