గరికపూలు. - బాపురం నరహరి రావు.

పేరు : బాపురం నరహరి రావు.
కవిత సంఖ్య : 218.
అంశం : గరికపూలు.
శీర్షిక : పూజకు పనికిరాని పువ్వులం!
************

ఆట కదరా శివా నీకు! జీవం పోసావు మాలోనూ
సొగసైన పూల ఆకారాన్ని ఇచ్చావు
సువాసనలు ఇవ్వడం మరిచావు
ఆహ్లాదాన్ని పంచే గుణం ఇచ్చావు
పూజకు పనికిరాని పువ్వులను చేసావు!
అందరూ తాకి సంతోషపడేవారే
మా పాటికి మేముంటామన్నా వదలిపెట్టరు వీరెవరూ!
మాకున్నట్లు పూలమనసులు లేవు వీళ్ళకు
కర్కశమే నిలువెల్లా నిండి ఉంటుంది నిర్దాక్షిణ్యంగా నలిపి పారేస్తారు
అందాలను ఆనందాలను పంచి పెట్టినా
అందం వెనుక ఉన్న మనసును చూడరు
బాహ్య సుఖాలే అవసరం వీళ్ళకు!
అయినా నీకివన్నీ ఎందుకు చెబుతున్నాము శివా ఇదంతా!?
నీకు తెలియనిదేముంది!? నీ సృష్టిలోని కృతులమే కదా మేము!?
మా కర్మ ఫలితాలను అనుభవించాల్సిందే కదా!?
ఇంపైన రంగులను అద్దావు మాకు నిండైన ఆకారాలనే ఇచ్చావు మరి!
గడ్డిపువ్వులని పేరే కానీ భూవస్త్రాన్నే పరిచేసావు మాకోసం
వనమంతా తిరిగి ఆడుకొమ్మని!
కలికాలం శివా ఇది!! ఆడుకోనివ్వరు ఆడుకొని వదిలేస్తారు
అందాలను ఆస్వాదించాలనే చూస్తారు
పరిమళాలు మేము వెదజల్లకున్నా ఆఘ్రాణించి మరీ జారుకుంటారు! ఏమి ఆనందమో వీరిది!?
ఇప్పుడైతే నెలకొని ఉండటానికి నెలవులే కరువయ్యేట్టు చేసారు!
ఎక్కడో అక్కడ ఒద్దికగా ఏ మూలలోనో
మేమంతకు మేమే పెరుగుతుంటాము!
సూర్యకిరణాల తాకిడికి మైమరచి పోతాం
రాత్రి మిగిల్చిన కన్నీళ్లు ఆవిరవుతాయి కదా కిరణాల వెచ్చదనానికి!
అల్ప సంతోషులము మేము శివా!
మా బ్రతుకులింతే...ఇలానే ఉంటాయి కడతేరేదాకా!!!

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి