గరికపూలవనం - కటుకం కవిత
పేరు:కటుకం కవిత
తేది:19/6/2019
అంశం: గరికపూలవనం
కవిత సంఖ్య:234
కవిత శీర్షిక: గరికపూలసందేశం
సృష్టికర్త సృష్టిలో ప్రతీది అద్భుతమే...
దేని ప్రత్యేకత దానిదే...
పరిమళాలు వెదజల్లే భాగ్యానికి నోచుకోకున్నా
మెత్తని తివాచీలా అల్లుకుపోతూ పుడమితల్లిని పచ్చనిచీరతో చుట్టేసి...
గులాబీ,తెలుపు వర్ణాల సోయగాలతో పిల్లతెమ్మెరకు వయ్యారాలు ఒలకబోస్తూ చూపరుల మనసుకు హాయిగొల్పే గరికపూల అందం వర్ణనాతీతం..!!
భానుడి భగభగలను తట్టుకునే సామర్థ్యంతో ఆత్మస్థైర్యంతో తన ఉనికిని
నిలదొక్కుకుంటూ...
తొలకరిచిరుజల్లులకే పులకించి హరితవర్ణాల మేనుతో... నూతనోత్సాహంతో...
వాడని చిరునవ్వులతో కనువిందు చేయు గరికపూల అందమే వేరు...!!
ప్రకృతివైపరీత్యాలను ఎదుర్కొని దృఢసంకల్పంతో కొత్త ఊపిరి నింపుకొని దినకరుని నునులేత కిరణాల చుంబనాలద్దుకొని
వికసించే గరికపూల సౌందర్యం మనుషులకే కాదు పశుపక్ష్యాదులకు సైతం ఆహ్లాదమే...!!
కష్టసుఖాలు, కలిమిలేముల సమాహారమైన జీవనయానంలో మొక్కవోనిదైర్యంతో సాగుతూ పదుగురి మదిని గెలిచి జీవనగమ్యం చేరి సేదతీరుమని తెలిపే గరికపూలవన సందేశమే మానవాళికి ఆదర్శం...!!

Comments
Post a Comment