గరిక పూలవనం -పత్తిపాటి రూపలత

పేరు -- పత్తిపాటి రూపలత 
అంశం -- గరిక పూలవనం  
శీర్షిక -- రంగుల తివాచీ
సంఖ్య -- 114
****
లేలేత భానుడి కిరణాలు 
భువి మీద పడగానే 
పచ్చటి గరిక తివాచీపై  
విచ్చిన రంగుల పువ్వులు 
చిరునవ్వులు చిందిస్తూ 
స్వాగతం పలికేవేళ  
ఆ దృశ్యం ఎంత మనోహరం 
పూజకు పనికిరాకపోతేనేం  
లోకానికి వెలుగిచ్చే 
ఆ తేజోమయుడికి ఉషోదయాన వర్ణ శోభితంగా ఆహ్వానం పలికి లోకాన్ని చైతన్యం చేయమంటాయి 
చూడడానికి చిట్టి పువ్వులే 
కానీ అవని చీరంతా పరచుకున్న 
తారల్లా ఆ చిన్ని పువ్వులే 
దేవుడి పాదాల చెంతకు చేరవు  
అమ్మాయి వాలుజడలో నిలువవు  
ప్రకృతి కన్యకు మాత్రం 
అందాన్ని చుట్టబెడతాయి  
అపురూప బంధంతో అలరారుతాయి  
ఆమని పిలిచే వేళ
అవనికి అందాన్ని పంచి 
వసంతగీతికనాలపిస్తాయి
మన ఆనందంలో భాగస్వామ్యానికి సై అంటాయి 

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి