గరిక పూల వనం - విజయలక్ష్మినాగరాజ్
విజయలక్ష్మినాగరాజ్
హుజురాబాద్
అంశం:గరిక పూల వనం
శీర్షిక: తొలకరి బహుమతి
ఎండిన ఎదపై
తొలకరి తుంపరల బహుమతి ...
పులకితల పుడమికి
పచ్చల పతకమై మెరిసే
గరిక పూల హారతి!
అధినాయకుని అగ్రపూజలో
భాగమయినా...
గడ్డిపరకతో సమానమంటు
తుచ్చంగా చూసినా...
అల్పమైనా అధికమైనా
సృష్టిలో దేని విలువ దానిదే అంటూ...
వినమ్రంగా ఒదిగే వినయశీలి!
వేడికి వాడి
అస్థిత్వాన్నే కోల్పోయినట్లు కనబడినా...
ఓపికకు మారు పేరై
ఒక్క చినుకుతో పునరుత్తేజితయై
సస్యశ్యామల తివాచీలా
కనువిందు చేసే రమణీయత!
ఉషోదయ వేళ
తుషార హారం ధరించి...
మదిని దోచే ప్రకృతికాంతకు
పచ్చబొట్టులా భాసిల్లినా...
మూగజీవాలకు అమ్మై ఆకలి తీర్చినా...
కమనీయమైన కావ్యంలా
హాయిని గొలుపుతూ...
మది మదినీ దోస్తుంది
ఈ....గరిక పూల వనం !
హుజురాబాద్
అంశం:గరిక పూల వనం
శీర్షిక: తొలకరి బహుమతి
ఎండిన ఎదపై
తొలకరి తుంపరల బహుమతి ...
పులకితల పుడమికి
పచ్చల పతకమై మెరిసే
గరిక పూల హారతి!
అధినాయకుని అగ్రపూజలో
భాగమయినా...
గడ్డిపరకతో సమానమంటు
తుచ్చంగా చూసినా...
అల్పమైనా అధికమైనా
సృష్టిలో దేని విలువ దానిదే అంటూ...
వినమ్రంగా ఒదిగే వినయశీలి!
వేడికి వాడి
అస్థిత్వాన్నే కోల్పోయినట్లు కనబడినా...
ఓపికకు మారు పేరై
ఒక్క చినుకుతో పునరుత్తేజితయై
సస్యశ్యామల తివాచీలా
కనువిందు చేసే రమణీయత!
ఉషోదయ వేళ
తుషార హారం ధరించి...
మదిని దోచే ప్రకృతికాంతకు
పచ్చబొట్టులా భాసిల్లినా...
మూగజీవాలకు అమ్మై ఆకలి తీర్చినా...
కమనీయమైన కావ్యంలా
హాయిని గొలుపుతూ...
మది మదినీ దోస్తుంది
ఈ....గరిక పూల వనం !
Comments
Post a Comment