పత్రహరితం - పత్తిపాటి రూపలత
పత్రహరితం - పత్తిపాటి రూపలత
పరువాల పచ్చటి కోక చుట్టుకున్నపచ్చందాల వనాలను చూస్తే
పుడమికి అందమైన భాగ్యం
మనిషికి నేత్రపర్వం
మొక్కకు ఆకులే అందాల రూపం
ఆకుకు పత్రహరితమే ప్రాణాధారం
పత్రహరితమే లేకుంటే మోడువారును వృక్షం
మనిషికి మంచితనం మానవత్వమే పత్రహరితం
అవిలేనివాడు జీవరహితం
మంచితనపు ఆనవాళ్లే వేర్లుగా అల్లుకున్న సమాజమే నివాసయోగ్యం
పచ్చగమెరిసే ఆకులతో
నిండిన వనమే ఆరోగ్యకరం
ఎండిన ఆకులలో పత్రహరితం శూన్యం
మంచితనం లేని మనిషి బ్రతుకే వ్యర్థం
**************
Comments
Post a Comment