గరికపూల వనం వకుళవాసు

పేరు ~ వకుళవాసు
హన్మకొండ
19/06/19
సంఖ్య ~126
అంశం ~ గరికపూల వనం

శీర్షిక ~🍃గరికపూలు 🍃

గరిక పూవులం మేము గరీబోల్ల పిల్లలం మేము

అలుపెరుగని అలల సవ్వడులం మేము

కాలాలతో దోస్తి కడతాం కన్నవారికి సాయం చేస్తాం

కలిసికట్టుగా కష్టపడతాం
కలో గంజో కడుపునిండా తింటాం

చదువుసంధ్యలో చురుకు కిరణాలం మేము
ఆటపాటల్లో ఆణిముత్యాలం

మట్టి వాసనలే అత్తరులు మాకు
 పచ్చని చెల్కలే పట్టుబట్టలు మాకు

సర్కారు బడిలో సదివి ఎదిగి
బతుకుపాఠాలు నేర్చిన గువ్వలం

చెట్లెక్కినా పుట్టలెక్కినా మాకు మేమే సాటి
రాలేరెవరు మాకు పోటి

ఎండాకాలం సెలవులల్లో చేపలమైతాం
చెర్లు కుంటలతో దోస్తీ కడతాం

తొలకరి జల్లులలో తడిసి పుడమిని పులకింపజేయ
 చిందులువేసే చిన్నారులం మేము...

పల్లెచెర్ల నిండుగ బూసిన కలువలం మేము
 సూరీడుతో దోస్తీ కట్టి
కిరణాల  రంగులద్దుకొని

పచ్చని మైదానంలో విరగపూచే
 రంగు రంగుల గరికపూలం మేము

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి