గరిక పూల వనం - కోణం పర్శరాములు

కోణం పర్శరాములు
చరవాణి : 9959524585
అంశం : గరిక పూల వనం
కవిత  సంఖ్య : (301)
శీర్షిక : పుడమి తోటలు
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
అంభుదిల నీరు ఆవిరై నింగి కెగసి మేఘాలను తడిమి
గగణాంతరాలలో దూది మబ్బుల గుంపులు బిర బిర
కదులుతూ ఊయలలూగుతూ
చల్లని స్వాతి చినుకులై నేలరాలుతుంటే
ఆ.... చిట... పట... చినుకుల సవ్వడికీ.
పుడమితల్లి ఒల్లంతా పులకరించి.
భూమాత ఒడిలో పచ్చని వస్త్రమై మొలకెత్తును గరక పూల వనాలు.
అవని మాత మెడలోన పచ్చల
హారమై అమరిపోవును మెడపై  మణిహారముగ గరిక.
గాలి తెరలకు గల గలసవ్వళ్ళు చేస్తూ అవతరించును అవనిపై
స్వర్గంలోని ఉద్యానవనములై.
గరక పోసల సిగలపై చిన్నని
పసుపు వన్నెలద్ది ముక్కుకు
ముక్కుకు ముత్యాల హారాలు.
అలసిన దేహాలకు విశ్రాంతి నిచ్చే క్రీడా మైదానాలు.
ప్రశాంత ప్రకృతికి పచ్చటి
నిలయాలు.
గాలిలో గరక పోసల సిగలపై
పిల్లల కోతికొమ్మచ్చి ఆటలు
మానవాలకిి మనసు కుదుట పరిచే ఆనందం నిలయాలు.
బృందావన గరికపూల వనంలో
సేదదీరిన గోపాల క్రిష్ణుడు.
పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఆత్మియ ఆలంబనాలు గరక పూల వనాలు.
పచ్చని గరిక వనాల తివాచీల లపై పాలపిట్టల దాగుడు మూతలు దండాకోర్.
పల్లె సీమల ఎదలో పూసిన
ముద్దు గులాబీలు గరికపూలు.
వాడిపోని వన్నె తరగనీ
పిల్లల పసి మనసులు నిష్కల్మష ప్రకృతి వనాలు.
దైవ పూజకు దగ్గరకాకపోవచ్చు
మనిషి ఉల్లాసానికి గరిక వనాలు నిలువెత్తు నిదర్శనం.
మసివారని పసి మొగ్గలు
మా పచ్చటి గరిక వనాలు.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి