గరిక పూల వనం - మమత ఐల

నేటి కవిత
తేది:—19—6—19
మమత ఐల
కవిత సంఖ్య:—69
అంశం:—గరిక పూల వనం
శీర్షిక:—అన్నీ ప్రకృతి అందాలే
——————————————
కుక్కపిల్ల
అగ్గిపుల్ల
సబ్బుబిల్ల
హీనంగా చూడకుదేన్ని
కవితా మయమేనోయ్ అన్ని
విత్తనమేసి
మొక్కనాటకున్న
తొలి వర్షంతోనే
నేనున్నాని చిగురిస్తూ వచ్చేది గరిక
ఆకుపచ్చ వనానికి
అలంకరించిన హారంలా
శోభను చేకూరుస్తుంది
ప్రకృతిని అందంలో ముంచెత్తుతుంది
దేనిసొగసు దానిదేనని
చూసే కనులను
పరవసింపజేస్తుంది
ఒకనాటి కాలంలో
పూజకు పనికి వచ్చే పూలమొక్కలు ఇంటింట పెంచేవారు
ముళ్ల కంప ఇంట పెంచకూడదని
నిమ్మ ,గులాబి మొక్కను
ఇంట కాకుండా తోటల్లోనే పెంచేవారు
ఇప్పుడంతా ఫ్యాషన్
షో ఫ్లవర్స్  అనిపెంచడం
ఆనవాతిగామారింది
తోటకు మాత్రమేకాక
ఇంటికి అందాన్నిస్తున్నాయ్

---మమత ఐల
       హైదరాబాద్ ---

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి