గరికపూలు - వెగ్గలం ఉషఃశ్రీ ~
నేటి కవిత
కవిత సంఖ్య 200
వెగ్గలం ఉషఃశ్రీ
అంశం ~ గరికపూలు
శీర్షిక ~🌷 తమదైన లోకం🌷
తొలకరి చినుకుల తడి తగిలినంతనే పురుడోసుకున్న పుడమి తనువు నుండి పుట్టిన గరిక...
పుడమి తల్లి మేనికి పచ్చ రంగు చీర చుట్టి చూపరులను ఆహ్లాద పరుస్తున్నది!
గరికకు పూచిన గరికపూలు వన్నెలేమీ లేక ఏ చూపునూ ఆకర్షించలేక పోయినా...
వీచే గాలితో తలలూపుతూ తమకు తామే ఆనందిస్తుంటవి!
తమ తొమ్మిది నెలల తల్లి గర్భవాసమును వీడి వెలుగు రేఖల ను వెదుకుతూ వచ్చిన కొన్ని జీవితాలు సైతం...
వయసెదిగినా మనసెదగనందున ఏ దృష్టినీ ఆకర్షించలేకపోయినప్పటికీ చిన్న బుచ్చుకోక తమదైన లోకంలో విహరిస్తూ ఆనందిస్తుంటవి!

Comments
Post a Comment