గరిక పూల వనం - కాసనగొట్టు స్వప్న.
కాసనగొట్టు స్వప్న.
అంశం: గరిక పూల వనం
శీర్షిక: గరిక పువ్వులమే
కవితసంఖ్య: 225
***********
తొలకరి చినుకుల మమతలు ధరణి తనువును తాకి చుంబించగనే
అవనికి హరిత చీరను చుట్టే గరిక వనాలమే..
కొద్దిపాటి జల్లులకే సంతృప్తి పడుతూ
కోకొల్లలుగా పుట్టుకొచ్చే నిరాడంబర తృణాలమే...
సంపన్నపు సౌరభాలు వెదజల్లే వివిధవర్ణ కుసుమాలం కాకున్నా..
దారికిరువైపులా నిలిచి ఆహ్లాదాన్నిచ్చే గుర్తింపు కోరని ప్రాణులమే..
పూజకు పనికివచ్చే పువ్వులనివ్వకపోయినా...
అగ్రపూజలందుకునే గణనాయకుని మెడలో హారాలమే...
మాపై నడిచే పాదాలకింద మెత్తలమై రక్తప్రసరణకు తోడ్పడుటే కాదు...
మన్నుతిన్న పాములు మాలో దాగుంటాయని హెచ్చరించే హితులం కూడా...

Comments
Post a Comment