గరికపూల వనం - మాధవీసనారా
మాధవీసనారా
అంశం:గరికపూల వనం
శీర్షిక:గడ్డికి గడ్డుకాలం
కవిత సంఖ్య:163
^^^^^^^^^^^^^^^^^^^^^^
మట్టితో విడదీయరాని బంధం అనుబంధం గడ్డిది
గడ్డిపరకల తల్లుల ముక్కుకి మెరిసే ముక్కెరలే గడ్డిపూలు
భూదేవి పిల్లలు గడ్డిపరకలు
గడ్డిపరకల పిల్లలు తుషారబిందువులు...గడ్డిపూవులు
తల్లిదండ్రుల్ని వదిలి అమెరికా వెళిపోయే పిల్లల్లా
తెల్లారగట్ల గడ్డితల్లిని అంటిపెట్టుకుని ఉండే తుషారబిందువులు
సూర్యుడు తన కిరణాల కుర్రాళ్ళతో రాగానే
వాళ్ళతో వెళిపోయే ఆడపిల్లలు
గరికపూవులే తల్లినంటిపెట్టుకుని ఉండే మగపిల్లలు
పూర్వం ఎందెందు వెదికినా
భూమినంతా పరచుకున్న దుప్పటిలా గడ్డే
ఇప్పుడు పొలాల్లో తప్ప
కాంక్రీటు అరణ్యంలో మట్టే కరువు
మట్టేలేని చోట ఇక గడ్డేం ఉంటుంది
ఇప్పుడు మనిషి ముఖం మీద మొలిచే గడ్డంకన్నా హీనమయింది గడ్డి
గడ్డి మొలవడానికి చోటులేని
గడ్డుకాలం వచ్చింది
Comments
Post a Comment