గరికపూలవనం - శ్రీదాస్యం లక్ష్మయ్య
గరికపూలవనం
శీర్షిక: విరిజల్లుల మందహాసం
***********
మమతల్ని పంచే మాధుర్యం
కళ్ళప్పగించే వలపుసోయగం
వనమై విరబూసిన నందనం
మా లలిత లావణ్య జీవన సంగీతం
సింగిడిలోని రంగులన్నీ అద్ది
సింగారించుకున్న నానావర్ణ సంగమం
పచ్చని పచ్చికపై పరుచుకున్న
తుషారబిందు పట్టకంలో
వివర్ణంకాని విరుల మాలికలం
గడ్డిపరక ఏలుబడిలో
గురుతుల తరకలు మిగలని
జిలుగు వెలుగుల జీవాలం
గుర్తింపు కోరని గుచ్ఛసముచ్ఛయం
ఆహార్యంతో అపసోపాలు పడక
ఆదరణకై ఆరాటపడక
వికసిత వదనంతో విరహగీతికలమై
విశ్వమానవాళిప్రేమలేక
నేలరాలుతున్న తృణభామినులం
పూవులమై పుడమిపైన
పురివిప్పిన జన్మమాది
హత్తుకునే మనసుంటే
ఆనందం పంచుతాం
విసిరేసిన చందమైన
ముసినవ్వులె రువ్వుతాం
చల్లని దీవెనలోస్తే మధుమాస గీతికలం
విలువలకు పాతరేసి విదిలించినా
మా బతుకు మధ్యతరగతి మందహాసం
శ్రీదాస్యం లక్ష్మయ్య
శీర్షిక: విరిజల్లుల మందహాసం
***********
మమతల్ని పంచే మాధుర్యం
కళ్ళప్పగించే వలపుసోయగం
వనమై విరబూసిన నందనం
మా లలిత లావణ్య జీవన సంగీతం
సింగిడిలోని రంగులన్నీ అద్ది
సింగారించుకున్న నానావర్ణ సంగమం
పచ్చని పచ్చికపై పరుచుకున్న
తుషారబిందు పట్టకంలో
వివర్ణంకాని విరుల మాలికలం
గడ్డిపరక ఏలుబడిలో
గురుతుల తరకలు మిగలని
జిలుగు వెలుగుల జీవాలం
గుర్తింపు కోరని గుచ్ఛసముచ్ఛయం
ఆహార్యంతో అపసోపాలు పడక
ఆదరణకై ఆరాటపడక
వికసిత వదనంతో విరహగీతికలమై
విశ్వమానవాళిప్రేమలేక
నేలరాలుతున్న తృణభామినులం
పూవులమై పుడమిపైన
పురివిప్పిన జన్మమాది
హత్తుకునే మనసుంటే
ఆనందం పంచుతాం
విసిరేసిన చందమైన
ముసినవ్వులె రువ్వుతాం
చల్లని దీవెనలోస్తే మధుమాస గీతికలం
విలువలకు పాతరేసి విదిలించినా
మా బతుకు మధ్యతరగతి మందహాసం
శ్రీదాస్యం లక్ష్మయ్య
Comments
Post a Comment