గరికపూలు - బల్లూరి ఉమా దేవి.
.బల్లూరి ఉమా దేవి.
కవితా సంఖ్య :166
అంశము: గరికపూలు
శీర్షిక:నా గోడు
ఎవరికి తెలుపను నా గోడు
ఎలా తెలుపును నా వ్యథను
పుడమి తల్లికి ఆకుపచ్చని కోక నౌతా
ప్రకృతి కాంతను పరవశింప చేస్తా
నన్ను హింసించినా ఈసడించినా
బాధ పడను కాని పనికిరాని పూవు నంటు
చారులో కరివేపాకు లా తీసి పారవేస్తుంటే
ఎవరికి తెలుపను నా గోడు
ఎలా తెలుపును నా వ్యథను
దేవునిగుడికో మగువల ముడికో
చేరలేని నిస్సారపు జీవితమయ్యె
విధివిలాస మంటు సరిపుచ్చుకోనా
పితౄకార్యాలకే పరిమితమేనా ఈ బ్రతుకు
గ్రహణవేళలో పనికొస్తా గాని
పూజకు పనికి రాని పువ్వే నేను
ఏకదంతుడి పూజకు మాత్రం
పనికి రావడమె నా భాగ్యం
ఈజన్మకిదే సౌభాగ్యం.
డా. బల్లూరి ఉమాదేవి
కవితా సంఖ్య :166
అంశము: గరికపూలు
శీర్షిక:నా గోడు
ఎవరికి తెలుపను నా గోడు
ఎలా తెలుపును నా వ్యథను
పుడమి తల్లికి ఆకుపచ్చని కోక నౌతా
ప్రకృతి కాంతను పరవశింప చేస్తా
నన్ను హింసించినా ఈసడించినా
బాధ పడను కాని పనికిరాని పూవు నంటు
చారులో కరివేపాకు లా తీసి పారవేస్తుంటే
ఎవరికి తెలుపను నా గోడు
ఎలా తెలుపును నా వ్యథను
దేవునిగుడికో మగువల ముడికో
చేరలేని నిస్సారపు జీవితమయ్యె
విధివిలాస మంటు సరిపుచ్చుకోనా
పితౄకార్యాలకే పరిమితమేనా ఈ బ్రతుకు
గ్రహణవేళలో పనికొస్తా గాని
పూజకు పనికి రాని పువ్వే నేను
ఏకదంతుడి పూజకు మాత్రం
పనికి రావడమె నా భాగ్యం
ఈజన్మకిదే సౌభాగ్యం.
డా. బల్లూరి ఉమాదేవి
Comments
Post a Comment