గరికపూలవనం -నగునూరి రాజన్న
నగునూరి రాజన్న
గంగి గోవు పాలు గరిటడైన చాలన్నట్లు
మన్నన లేని రాజులెందరో మహిన .... లెక్క తెలియనంత
కాని మానవత్వం మూర్తీభవించిన
మనసున్న మారాజులంతా శ్రీరామచంద్రులే ....
యుగాలు మారినా జగాన వెలిగేది...
రాశి కన్నా వాశి గొప్పదన్నట్టు
కౌరవులు లెక్కకు నూరయినా
సత్తా చాటినోళ్లు ఒకరో ఇద్దరో.....
పాండవులు నిక్కచ్చిగా ఐదుగురే
అన్నింటిలో ఆరితేరినవారు.....
దైవ చేయూత పొందినవారు .....
అందరూ ఆ దైవాంశులే అయినా ...
మన పాలక నాయకులవలె
ఆయన కృప పొందేది ఎందరికో ....
ఈ శకపు ప్రజా మనో రంజకునివలె ...
కాలేరు సమం మన కలాం గారికి....
గంపెడైతేనేమి గరిక పూలు
సుందరానికి తప్ప సువాసనలు లేక
అందానికి తప్ప అలంకారానికి రాక
ఆహ్లాదానికి తప్ప దైవార్పణ చేయలేని
మనోరంజకానికి తప్ప పూజకు పనికి రానివి...
గంగి గోవు పాలు గరిటడైన చాలన్నట్లు
మన్నన లేని రాజులెందరో మహిన .... లెక్క తెలియనంత
కాని మానవత్వం మూర్తీభవించిన
మనసున్న మారాజులంతా శ్రీరామచంద్రులే ....
యుగాలు మారినా జగాన వెలిగేది...
రాశి కన్నా వాశి గొప్పదన్నట్టు
కౌరవులు లెక్కకు నూరయినా
సత్తా చాటినోళ్లు ఒకరో ఇద్దరో.....
పాండవులు నిక్కచ్చిగా ఐదుగురే
అన్నింటిలో ఆరితేరినవారు.....
దైవ చేయూత పొందినవారు .....
అందరూ ఆ దైవాంశులే అయినా ...
మన పాలక నాయకులవలె
ఆయన కృప పొందేది ఎందరికో ....
ఈ శకపు ప్రజా మనో రంజకునివలె ...
కాలేరు సమం మన కలాం గారికి....
గంపెడైతేనేమి గరిక పూలు
సుందరానికి తప్ప సువాసనలు లేక
అందానికి తప్ప అలంకారానికి రాక
ఆహ్లాదానికి తప్ప దైవార్పణ చేయలేని
మనోరంజకానికి తప్ప పూజకు పనికి రానివి...
Comments
Post a Comment