గరికపూల వనం - శైలజ మంగళంపల్లి
పేరు: శైలజ మంగళంపల్లి
అంశం: గరికపూల వనం
కవితా సంఖ్య:74
శీర్షిక: శ్రమవనం
ఆ వనం లో పూలు
పుడమికి చేరువలో మట్టి పరిమళాలను వెదజల్లుతాయి
శ్రమ స్వేదపు తడిలో
అందంగా మెరుస్తాయి
ఎండకు ఎండుతూ
వానకు తడుస్తూ
వేకువలో నవ్వుతూ
వెన్నెలలో సేదతీరుతూ
ఒద్దికగా ఓర్పుగా
మనసులోని సమాజపు తోటలో ఒంటరి పయనం
సాగిస్తుంటాయి
గుర్తింపు లేని మనుగడలో
బ్రతుకు పోరాటం చేస్తుంటాయి
తమ ఉనికి కై
ఓటమి ఎరుగని దీశాలిలా
గుట్టుగా గుంభనంగా సాగిపోతుంటాయి
సుడిగాలిలో చెక్కు చెదరని
స్థైర్యంలా
చితికిన బ్రతుకులో తలెత్తి నిలిచే ఆత్మ విశ్వాసపు ప్రతీకలా
కాలపు పరీక్షకు నిలిచే గెలుపులా
శిశిరం ఎరుగని పూతోటలో
శ్రమ సుగంధాలను వెదజల్లుతుంటాయి
అందుకే ఆ వనం ఎప్పటికీ
వాడిపోని వన్నె తరగని
శ్రమ కుసుమాలు బృందావనం
అంశం: గరికపూల వనం
కవితా సంఖ్య:74
శీర్షిక: శ్రమవనం
ఆ వనం లో పూలు
పుడమికి చేరువలో మట్టి పరిమళాలను వెదజల్లుతాయి
శ్రమ స్వేదపు తడిలో
అందంగా మెరుస్తాయి
ఎండకు ఎండుతూ
వానకు తడుస్తూ
వేకువలో నవ్వుతూ
వెన్నెలలో సేదతీరుతూ
ఒద్దికగా ఓర్పుగా
మనసులోని సమాజపు తోటలో ఒంటరి పయనం
సాగిస్తుంటాయి
గుర్తింపు లేని మనుగడలో
బ్రతుకు పోరాటం చేస్తుంటాయి
తమ ఉనికి కై
ఓటమి ఎరుగని దీశాలిలా
గుట్టుగా గుంభనంగా సాగిపోతుంటాయి
సుడిగాలిలో చెక్కు చెదరని
స్థైర్యంలా
చితికిన బ్రతుకులో తలెత్తి నిలిచే ఆత్మ విశ్వాసపు ప్రతీకలా
కాలపు పరీక్షకు నిలిచే గెలుపులా
శిశిరం ఎరుగని పూతోటలో
శ్రమ సుగంధాలను వెదజల్లుతుంటాయి
అందుకే ఆ వనం ఎప్పటికీ
వాడిపోని వన్నె తరగని
శ్రమ కుసుమాలు బృందావనం
Comments
Post a Comment