పత్రహరితం - కొమురవెల్లి అంజయ్య

కొమురవెల్లి అంజయ్య
అంశం ;పత్రహరితం
శీర్షిక :పచ్చగుంటేనే

ప్రకృతి పత్రహరితానికే
మనసు చెట్టై ఊయలలూగేది
ఆరోగ్యాలు జాతర చేసుకునేది
ఆలోచనలు విశ్వజనీనమయ్యేది
జ్ఞాన సంపద తపస్సుకు
పచ్చని మురిపాల చెట్లే పీటలేసేది

పచ్చగా ఉన్నంత కాలమే మనిషి
పక్షులు వాలి గూళ్ళు కడతాయి
నీడల నట్టింట్లో సాటి జీవజాలం
కోకిలమ్మలు వాలితే సంగీత పవనాలు
కోతులు వాలితే విధ్వంస రచనలు
చీడ పురుగులు చేరితే మొదటికే మోసాలు

సూర్య, వరుణుల కరుణ ఉప్పొంగితే
పుడమిపై అడవులు పాడిపంటలు
ఆకలి అత్యాశల స్వార్థ చెడ్డి గ్యాంగ్ లకు
వయసుతో పనేముంది, దొంగకు చెప్పే లాభం
చిగుళ్ల పైనే హత్యాచార చిదిమేయడాలు
పచ్చని పరువాలను తమలపాకుల్లా నమిలేయడం
పచ్చని అందాలను పాతర్ల ఊబిలో దించడం

ఆకుల్ని దూసేసి కొమ్మ నోట్లో పెడితే
పాచి తొలగించే పండ్ల పుల్ల
కొమ్మలు మండలతో  పందిరేస్తే పెళ్లి వేడుక
కోల్పోయిన చెట్లకు దాతల ఆనందం
మూలాలకు యంత్రాల రంపపు కోతలు
పచ్చనింట్ల దోపిడీల చిచ్చులే
మిగిలేది జీ'వనాల' రోదనలే
.......................................
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి