గరికపూలవనం - చిందం సునీత

పేరు: చిందం సునీత
తేది: 19/6/2019
అంశం: గరికపూలవనం
కవిత సంఖ్య: 174
కవిత శీర్షిక: గడ్డిపూలు

చిరుజల్లులతో మొలకెత్తి
ప్రకృతి అందాన్ని తెచ్చి
పచ్చదనాన్ని తివాచిలా పరిచి
రంగుల పూలెన్నో పూసి
దారెంట పోయేటి
బాటసారులకు
సుతిమెత్తని పలకరింపులతో
తొక్కినా,
బాధను లెక్కచేయక
మంచు బిందువులను
ఎదనిండా పరచుకొని
అందాల గరిక పూలవనం
తోడుగా
ఆరుద్ర పురుగులతో
అలంకరించుకొని
కల్మషమెరిగిన మనిషికి
మలినమంటని
మంచి అందాల పూలతో
స్వాగతం పలుకుతూ
పూజలకైనా, తల్లోకైనా
అవసరం లేకున్నా
మనసుకు హయినందిస్తాయి!!.
నేలమ్మకు అందాన్నిస్తాయి!!.

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి