గరిక పూలు - గంగాపురం శ్రీనివాస్

గంగాపురం శ్రీనివాస్
అంశం: గరిక పూలు
శీర్షిక: నేనొస్తున్నాను
19.06.19
సంఖ్య: 172
"""'"""""""""""""""""""""""

నేనొస్తున్నాను...
నాపరాయిపై నూరిన గండ్రగొడ్డలి తీసుకుని
పచ్చని చెట్లను నరికే వారిని అడ్డగించడానికి

నేనొస్తున్నాను...
విల్లంబులు నింపిన ధనుర్భాణాలు భుజాన వేసుకుని
అడవి జంతువులను వేటాడే వారిని అటకాయించడానికి

నేనొస్తున్నాను...
తూటాలు నింపిన తుపాకీని సరి చేసుకుని
నేరగాళ్ల గుండెలపై గురి పెట్టడానికి

నేనొస్తున్నాను...
శౌర్యపు సిరాను పదునెక్కిన కలంలో నింపుకుని
పనిచేయని ఉద్యోగులను ప్రశ్నించడానికి

నేనొస్తున్నాను...
తల్లుదండ్రులను గరిక పూలలా భావించి
దూరంగా ఉంచే దుర్మార్గులను దునుమాడడానికి

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి