గరిక పూల వనం - గజవెళ్ళి శ్రీనివాసాచారి

గజవెళ్ళి శ్రీనివాసాచారి
కవిత సంఖ్య: 233
అంశం: గరిక పూల వనం
...
తొలకరి జల్లులతో
జీవం పోసుకునేది గరిక
నేలంతా పాకుతూ
నాట్యం చేస్తున్నది

గణపతికి గరిక ఇష్టమైనా
గరిక పూలు మాత్రం
పూజకు పనికి రావు
ఏ పూలైనా
మనసుకు ప్రసాదించు ప్రశాంతత

గడ్డిపూల వంటి
గరీబోల్ల ఆకలి మంటలు
తీర్చే నాధుడేడి
కన్నీళ్లను తాగి బతికే
కష్ట జీవులు వీళ్ళు
గరీబోల్ల జవసత్వాలను
జుర్రేసే ధనిక వర్గం
ఎన్ని ప్రణాళికలు రచించినా
ఏమి ఫలితం
ఎపుడు మారు
ఈ గడ్డి పూల బతుకులు

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి