గరికపూలవనం - సోంపాక సీత

సోంపాక సీత
కవిత సంఖ్య: 183
అంశం: గరికపూలవనం
శీర్షిక: గుప్పెడైనా చోటిద్దాం...
*******

బహుముఖ కీర్తి కిరీటాలను
అందుకుంటూ అల్ప ప్రాణమైనా.... అనంతకోటి కి ఆత్మబంధువై ఆలింగనం చేసుకుంటుంది ....

శుభాశుభాల్లో సంయమనానికి సంకేతమై
సరి,బేసి సంఖ్యలతో సయ్యాటలాడుతూ
ఆచమన సమయాల్లో కుడిచేతి ఉంగరపు వేలుకు
పవిత్రమై ఫోజులిస్తుంది....

వివిధ పదార్థాల్లో ప్రాణశక్తిని నింపుతూ వాటి గ్రహణాన్ని
వదిలించగల మృతసంజీవని అవుతుంది ....

ధ్యానానికి దర్భాసనమై,
వేమన పద్యానికి నీతిసారమై,
నరులలో సత్వగుణాన్ని పెంచే సద్గుణమైన దర్భలు.... అపవిత్రంగాదు
పవిత్రమైన వృక్ష సంపద
మన ఇంట్లో దీనికి గుప్పెడైనా చోటిద్దాం....

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి