గరికపూలవనం - ఏడెల్లి రాములు

ఏడెల్లి రాములు
అంశం*గరికపూలవనం
శీర్షిక* నేల చుక్కలు

ఓ కణుపు కనుమై
ధరణినేలే గరిక
గోమాతకు ప్రమథనాథునికి ప్రియం

గాంధీ తాత గారికి నచ్చిన పచ్చడి
యుగాలుగా నేలతల్లికి పచ్చని తివాచీ
మనసుకు సత్తువై హత్తుకునే ప్రకృతి

తా తిన్న గాడిద చెడినా గరిక చెడదు
తరుగులేని భూ సంపదై పాడికీ గోదకూ
 సాదు జంతువులకు ఇష్టమైన నేస్తం

అక్కడక్కడా చేలో కలుపుమొక్కై
పంట దిగుబడులకు కొక్కెమేస్తుంది
గట్టుమీద రారాజై మోపులకు కోతౌతుంది
వెండి కొడవలికి పిడికిల్లుగా నిండిపోతుంది

విఘ్నరాజు పూజకు వినమ్రంగా ఉంటూ
గ్రహ వేళలో గరికే ఇంటింటా అభయహస్తం
వరదకు వంగి కుంగకుండా నిలబడి
సృష్టి లో మూగజీవాలకు వరదాయిని

మంచు ముత్యాల తలంబ్రాలతో
మేలిమి పచ్చల పతకం
కొండల నిండా తరగని అందాల శోభ

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి