గరిక పూల వనం - పగిడిపల్లి సురేందరు పూసల
పగిడిపల్లి సురేందరు పూసల
అంశం:గరిక పూల వనం
శీర్షిక : అంమైన పూల వనం
కవిత స0ఖ్య :126
19-6-19
-----------------------------------
మేఘాలన్ని జతకూడి ఆటల పాటలతో
ఆనందములను ఒంపు సొంపులతో
గగన తలమున సాగుతుంటే
వాయులీన స్పర్శలకు కరిగిపోతూ
చల్లని చినుకులై నేలపై పడుతుంటే
పచ్చని ఒడిని తడిగా తుదిమి
పుడమికి చేరువలో పులకించే
తుషార సమీరా పరిమళాలు గరికపూలు
భూమిపై ఆకు పచ్చచీరగా చుట్టుకొన్న
నవనీత కౌమార కౌముది గరిక వనం
లేలేత సొబుసులతో అవనిపై పరుచుకొని
ఆసాంతం ఆహ్లాదం కలిగించే
మౌన కుసుమాపు సౌందర్య పరగం
ఓర్పుతో నేర్పుగా ఒదుగుతూ
కాళి అందియాలకు తాకుతూ
సుకుమారంగా గుట్టుగా ఉంటాయి
గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే
ఆవిరి నీరులు అమాంతం లేక
తడిలేని మనసులు ఉసురు కనరాక
ఆధునిక సిమెంట్ నేలపై పొదలులేక
మట్టిలేని గూడు మనుగడలేక
గరికపూలు పెంపులేక
కష్టాల వనములో తిప్పల చారికలు లేక
గరికపూలు గట్టు గొండ్రాలిగా మారి
గడ్డుకాలం స్వాగతం పలుకుతూ
ప్లాస్టిక్ పూలు వనముతో
షోకేజ్ పెరంటాలలో దర్శనమిస్తున్నాయి
అంశం:గరిక పూల వనం
శీర్షిక : అంమైన పూల వనం
కవిత స0ఖ్య :126
19-6-19
-----------------------------------
మేఘాలన్ని జతకూడి ఆటల పాటలతో
ఆనందములను ఒంపు సొంపులతో
గగన తలమున సాగుతుంటే
వాయులీన స్పర్శలకు కరిగిపోతూ
చల్లని చినుకులై నేలపై పడుతుంటే
పచ్చని ఒడిని తడిగా తుదిమి
పుడమికి చేరువలో పులకించే
తుషార సమీరా పరిమళాలు గరికపూలు
భూమిపై ఆకు పచ్చచీరగా చుట్టుకొన్న
నవనీత కౌమార కౌముది గరిక వనం
లేలేత సొబుసులతో అవనిపై పరుచుకొని
ఆసాంతం ఆహ్లాదం కలిగించే
మౌన కుసుమాపు సౌందర్య పరగం
ఓర్పుతో నేర్పుగా ఒదుగుతూ
కాళి అందియాలకు తాకుతూ
సుకుమారంగా గుట్టుగా ఉంటాయి
గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే
ఆవిరి నీరులు అమాంతం లేక
తడిలేని మనసులు ఉసురు కనరాక
ఆధునిక సిమెంట్ నేలపై పొదలులేక
మట్టిలేని గూడు మనుగడలేక
గరికపూలు పెంపులేక
కష్టాల వనములో తిప్పల చారికలు లేక
గరికపూలు గట్టు గొండ్రాలిగా మారి
గడ్డుకాలం స్వాగతం పలుకుతూ
ప్లాస్టిక్ పూలు వనముతో
షోకేజ్ పెరంటాలలో దర్శనమిస్తున్నాయి
Comments
Post a Comment