గరికపూలవనం - కళావతి కందగట్ల

నేటికకవిత...
అంశం...గరికపూలవనం
కవితసంఖ్య...154
శీర్శక...మరుజన్మ
కళావతి కందగట్ల

బంతి నైనా కాకపోతిని
బతుకమ్మ గా అమరగా
మల్లెనైనా కాకపోతిని
మగువ జడలో తురుమగా

గులాబి నైనా కాకపోతిని
ప్రేమికులకు గురుతుగా
చేమంతి నైనా కాకపోతిని
చెలియ దోసిట నింపగా

కమలమైనా కాకపోతిని
కనకదుర్గను పూజింపగా
తులసిదళమై కాకపోతిని
స్వామి పాదముపై వాలగా

నేను చేసిన పాపమేమో
గరిక పూలగ  జన్మించితి
మరుజన్మ కైనా వరము నీయవ
స్వామీ నీ పాదముల నను
చేర్చగా....

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి