గరిక పూలవనం మద్దెల సరోజన (కలం: సహజ)

మద్దెల సరోజన (కలం: సహజ)
క్రమ. సం: 79
అంశం: గరిక పూలవనం
శీర్షిక: మొక్కవోని ధైర్యం
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
తొలకరితో పులకరించిన నేల తనవు
గరిక వనమై ధరణి ఆంత దవనమయ్యే
అవని అంతా ఆకుపచ్చని చీర పరచుకొని
ముక్కు పుడకల్లాంటి రంగులపూలతో 
రమ్యంగానందనవనమై వర్ణరంజితం కాగా
మోడువారిన తరువులన్ని తలారబోసుకొని
చిలక పచ్చని చివురులతో సిగ్గు పడుతూ
సింధూరపు విరులతో చిరునవ్వులు చిందిస్తూ
ప్రకృతి కాంత చిరుగాలుల సవ్వడికి
తలలూపుచూ తన్మయత్వం చెందుచుండగా 
ఈదురు గాలులతో ఉరుములు మెరుపులు 
వడగండ్ల వానతో తుఫాను సృష్టించిన భీభత్సం 
కూకటి వేళ్ళతో సహా వృక్షాలు  నేలకూలగా
గరిక పూల వనం  పరిచిన తివాచిలా
మొక్కవోని ధైర్యంతో నిలిచి ఉంది
లోకంలో ధనవంతుల కంటే పేదవారే హెచ్చు
డబ్బు ఏ రూపంలో వచ్చి ఎలా పోతుందో
పెరుగుతున్న ఆయువు డబ్బు శాశ్వతం కాదని
క్రింది స్థాయిలో ఉన్నవారిని ఏనాడు
తక్కువ చేసి చూడరాదని 
ప్రకృతి లో దేనికి అదే గొప్పతనాన్ని కలిగి
ఉంటుందనే సత్యాన్ని తెలుసకొని
కష్టకాలంలోనూ ధైర్యాన్ని వీడక ఉండాలనేది
ప్రకృతి నేర్పే నైతిక విలువల పాఠమే

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి