గరికపూలు - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
హైదరాబాద్
కవితసంఖ్య..248
అంశం..గరికపూలు
శీర్షిక..తల్లికి పిల్లలంతా ఒకటే
-------------------------------------
ప్రకృతి తన పిల్లలను చూసి పరవశించి పోతుంది!!
తనలో ఎన్ని నిధులు దాచుకున్న
అందరికి పంచే దానగుణం ధరణిది!!
పచ్చని చీరకట్టి మురిసినా
రంగురంగుల పూలతో పరవశించి పోతుంది పుడమి తల్లి!!
పూచిన పూలన్ని దేవుని చేరవు
జడలో వాలిపోవు
నేలను ముద్దాడుతాయి కొన్ని!!
రంగురంగుల గరికపూలు ఆకర్షణీయంగా అందరి మదిని దోస్తాయి
గణపతి చెంతకు తన తల్లి చేరుతుందని తెగ సంబరపడి వికసిస్తాయి!!
గుడ్డివాడైనా కుంటివాడైనా
తెలివున్నా లేకపోయినా
కన్నతల్లికి అందరూ ఒకటే!!
ఐదు వేళ్ళు ఒకే తీరుండవు
పిల్లలందరూ ఒక తీరుండరు
ఎవరి మనుగడ వారిదే
కానీ కాకి పిల్ల కాకికి ముద్దు
ఏ చెట్టయిన ఏ పూవైనా పుడమికి ముద్దు...!!!

Comments
Post a Comment