గరిక పువ్వు - అభిరామ్
అయ్యా శివయ్యా
నేను గర్భమను నేలను చీల్చుకొని వచ్చిన
గరికను
నాలో బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య దశలే
కణుపులు
లోలోపల ఎండుతున్న నిండుకుండలా
పచ్చగా కనిపించే ఆకులే దేహనిర్మాణ భాగాలు
సుఖ నీరు తగిలితే ఎగిరి గంతేస్తుంది
దుఃఖ నీరు తగిలితే కృంగి కూలబడుతుంది
అంతేగానీ పూర్తిగా ఎండిపోని గరిక ఇది
ఈ గరికలోనే
స్వాతిముత్యంలా మెరిసే ఆశా నీటిబిందువుల
మధ్యన
కోరికల రెక్కలతో మనసను గరిక పువ్వు విచ్చుకుని
పరిమళిస్తున్నది
నీ పూజకు స్వీకరించవయ్యా సదాశివ
అభిరామ్
నేను గర్భమను నేలను చీల్చుకొని వచ్చిన
గరికను
నాలో బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య దశలే
కణుపులు
లోలోపల ఎండుతున్న నిండుకుండలా
పచ్చగా కనిపించే ఆకులే దేహనిర్మాణ భాగాలు
సుఖ నీరు తగిలితే ఎగిరి గంతేస్తుంది
దుఃఖ నీరు తగిలితే కృంగి కూలబడుతుంది
అంతేగానీ పూర్తిగా ఎండిపోని గరిక ఇది
ఈ గరికలోనే
స్వాతిముత్యంలా మెరిసే ఆశా నీటిబిందువుల
మధ్యన
కోరికల రెక్కలతో మనసను గరిక పువ్వు విచ్చుకుని
పరిమళిస్తున్నది
నీ పూజకు స్వీకరించవయ్యా సదాశివ
అభిరామ్
Comments
Post a Comment