పత్ర హరితం - మద్దెల సరోజన
నేటి కవిత: తేది: 20.6.2019
""""""""""""""""""""""""""""""""""""""""""""
మద్దెల సరోజన (కలం: సహజ)
క్రమ.సం: 80
అంశం: పత్ర హరితం
శీర్షిక: ప్రాణపదం
======================
సృష్టిలో ప్రతి ప్రాణి జీవించడానికి
గాలి నీరు ఆహారం ఎంత ముఖ్యమో
ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి
పోషక పదార్థాలు అంతే ముఖ్యం
మొక్కలు ఆకు పచ్చగా ఉండటానికి
కిరణజన్య సంయోగక్రియ తోడ్పడితే
పచ్చని చెట్లతో ప్రకృతి అంతా పరవశమే
మనిషికి జీర్ణక్రియ బాగుంటే ఆరోగ్యమే
ఆకులు చిగురించింది మొదలు
రంగు ముదిరి పండి రాలే వరకు
ప్రకృతికే కాక కంటికి ఆయుర్వేదానికి
ఉపయోగకారిణి ఉత్తమ ఔషదిని
ఆకుపచ్చని ఆకుకూరలు ఆరోగ్యకరం
పచ్చగా ఉన్నంత కాలం పరోపకారిగా
ఎండినా మోదుగు తునికి ఆకుల్లా
ఉపయోగపడుతూనే ఉన్నాయి
పచ్చదనం మన ప్రాణప్రదం కావాలి
విత్తనాలువిత్తి మొక్కలు నాటి
చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడుదాం
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని చాటుదాం
ఇంటికో చెట్టును నాటు ఆదర్శంగా నిలబడుదాం
""""""""""""""""""""""""""""""""""""""""""""
మద్దెల సరోజన (కలం: సహజ)
క్రమ.సం: 80
అంశం: పత్ర హరితం
శీర్షిక: ప్రాణపదం
======================
సృష్టిలో ప్రతి ప్రాణి జీవించడానికి
గాలి నీరు ఆహారం ఎంత ముఖ్యమో
ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి
పోషక పదార్థాలు అంతే ముఖ్యం
మొక్కలు ఆకు పచ్చగా ఉండటానికి
కిరణజన్య సంయోగక్రియ తోడ్పడితే
పచ్చని చెట్లతో ప్రకృతి అంతా పరవశమే
మనిషికి జీర్ణక్రియ బాగుంటే ఆరోగ్యమే
ఆకులు చిగురించింది మొదలు
రంగు ముదిరి పండి రాలే వరకు
ప్రకృతికే కాక కంటికి ఆయుర్వేదానికి
ఉపయోగకారిణి ఉత్తమ ఔషదిని
ఆకుపచ్చని ఆకుకూరలు ఆరోగ్యకరం
పచ్చగా ఉన్నంత కాలం పరోపకారిగా
ఎండినా మోదుగు తునికి ఆకుల్లా
ఉపయోగపడుతూనే ఉన్నాయి
పచ్చదనం మన ప్రాణప్రదం కావాలి
విత్తనాలువిత్తి మొక్కలు నాటి
చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడుదాం
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని చాటుదాం
ఇంటికో చెట్టును నాటు ఆదర్శంగా నిలబడుదాం
Comments
Post a Comment