కోకిలమ్మ - పత్తిపాటి రూపలత


కోకిలమ్మ - పత్తిపాటి రూపలత 

ఆమని కను సైగతో
వసంతం మొగ్గతొడిగేను
అంబరం నీలి మేఘాలతో
హాయి హాయిగా సాగేను
శిశిరమున మోడులన్నీ
చివురలతో కనువిందుజేసెను
పచ్చ పచ్చగా ప్రకృతి పరువాలు ఆరబోసేవేళ
ఏ కొమ్మలో దాగుందో
రాగాల కోయిల
తన గొంతు సవరించి
రాగమందుకొంది
తీయటి చివురులు తిని
మత్తకోయిల మత్తుగా
కొమ్మెక్కి కూసింది
ఏ పూలతో దేవుని పూజించినదో
రాగాల స్వరమిమ్మని
రతనాలే పోసిందో
తేనెతో అభిషేకించి
ఆ అమృత స్వరాన్ని
పొందినదో
తెల తెల వారకముందే
ఆ కుహు రాగాలతో
లోకానికి సుప్రభాతం పాడింది
సమస్త జనులను తన రాగానితో వశపర్చుకుంది
తనకంటే గొప్పదవుందని
తలిచాడేమో ఆ పైవాడు
నల్ల రంగునలమి
అంద విహీనం చేసాడు
అందం లేకున్నా ఆ మధుర రాగాన తేలి జగాన్ని మత్తులో ముంచెత్తి కోయిలమ్మ
అమనికే సంకేతమవ్వలేదా
వన్నెల వసంతానికి
గుర్తుగా మిగిలింది కదా !!
********************
🖋అద్వైత 🖋

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి