గరిక పూల వనం..అన్నాప్రగడ వేంకట నరసింహారావు

పేరు.. అన్నాప్రగడ వేంకట నరసింహారావు
సంఖ్య..232
అంశం..గరిక పూల వనం..
శీర్షిక.. ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ..

ప్రాతఃసమయంలో ఒక్కసారి దృష్టి ఉదయించే సూరీడు,పచ్చటి ఇంటి మైదానంపై పడగా..
గరికపూలవనం లాంటి మైదానంపై ధవళ బిందువులు ముత్యాల్లా మెరుస్తూ..
ఒక పక్క తూర్పున భానుడు పైకి ఎగబడుతుంటే తోటలోని ప్రతిపత్రము మెరుస్తూకానరాగా..
కొద్దిసేపటికి అందమైన మంచుబిందువులు కరగనారంభించగా వాటిని లెక్కించనా..
ఎదుగుతున్న మామకు నమస్కరించనా..
ఆదిత్యుడు వేడితాపమును విస్తరింపచేయడం కాదనలేని నిజం..
మరి నా మంచిబిందువులు నిజం కాదా..
భానుడు ప్రతిదినము ప్రకాశిస్తాడు, నా మంచుబిందువులు రోజూ కానరావుగా..
మంచుబిందువులు తాకి ప్రతీసుమం చక్కగా పరిమళీస్తుంటే..
రవిప్రకోపం సుమాన్ని ఎండబెట్టి వాలిపోయేలా చేస్తూ..
ప్రకృతిలో అన్ని వింతలే, వాటి ధర్మానుగుణంగా నడుచుకుంటూ..
అన్నిటినీ భరించక తప్పదు...

Comments

Popular posts from this blog

కోకిలమ్మ - కాసనగొట్టు స్వప్న.

కోకిలమ్మ - మద్దెల ప్రభాకర్

కోకిలమ్మ - దారల విజయ కుమారి